Share News

ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 19 , 2026 | 10:09 PM

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22 నుంచి జరిగే సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు.

ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22 నుంచి జరిగే సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్‌ డిపో ముందు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, 2021, 2205 జీతభత్యాలను సవరించాలని, కండక్టర్‌, డ్రైవర్లకు ఉద్యోగ భధ్రత కల్పించాలన్నారు. అలాగే ఎలక్ర్టిక్‌ బ స్సులు ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలన్నారు. మహాలక్ష్మీపథకం కింద ప్ర భుత్వం ఇవ్వాల్సిన డబ్బులు రూ. 400 కోట్లు ప్రతి నెల కోత విధిం చకుం డా ఇవ్వాలన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేసి అర్హులైన వారికి ప్రమోషన్‌లు కల్పించాలన్నారు. రిటైర్డు ఉద్యోగులకు రా వాల్సిన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. అద్దె బస్సులను, అందులో పనిచేస్తున్న సిబ్బందిని ఆర్టీసీలో విలీనం చేయాలన్నారు. సమ్మె లో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కలీందర్‌ఆలీఖాన్‌, పౌలు, సమ్మయ్య, బాజీసైదా, లక్ష్మయ్య, పోశం, శ్రీనివా స్‌, తిరుపతి, శ్రీనివాసులు, జ్యోతి, అనుష, ప్రభావతి పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 10:10 PM