ఆర్టీసీలో మహిళల పనితీరుఅభినందనీయం: ఎండీ నాగిరెడ్డి
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:32 AM
ఆర్టీసీలో మహిళా ఉద్యోగులు, సిబ్బంది పనితీరు అభినందనీయమని సంస్థ ఎండీ నాగిరెడ్డి అభినందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్టీసీలో మహిళా ఉద్యోగులు, సిబ్బంది పనితీరు అభినందనీయమని సంస్థ ఎండీ నాగిరెడ్డి అభినందించారు. ఇంటా బయట అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నా.. ఎంతో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తారని కొనియాడారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈతరం మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని తెలిపారు.ఫైనాన్స్ అడ్వైజర్ విజయ ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా ఉద్యోగులను సన్మానించారు.