Share News

ఒకరేమో బాస్‌.. మరొకరు ఉద్యోగి

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:34 AM

ఒకరేమో ఆ సంస్థ బాస్‌.. మరొకరు ఉద్యోగి. విధి నిర్వహణలో ఇద్దరూ కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి...

ఒకరేమో బాస్‌.. మరొకరు ఉద్యోగి

  • విధి నిర్వహణలో కలుసుకున్న పాఠశాల మిత్రులు

  • బాల్య మిత్రుడిని ఆలింగనం చేసుకున్న ఆర్టీసీ ఎండీ

భువనగిరి టౌన్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ఒకరేమో ఆ సంస్థ బాస్‌.. మరొకరు ఉద్యోగి. విధి నిర్వహణలో ఇద్దరూ కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి బస్టాండ్‌లో కనిపించింది. ఆర్టీసీ ఎండీ హోదాలో ఐపీఎస్‌ అధికారి నాగిరెడ్డి భువనగిరి బస్టాండ్‌ పరిశీలనకు వచ్చారు. ఆయన రాక ఏర్పాట్లను పరిశీలిస్తున్న యాదగిరిగుట్ట డిపో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మర్రిపల్ల అచ్చయ్య బస్టాండ్‌లో పరస్పరం ఎదురుపడ్డారు. 1986లో సర్వేల్‌ గురుకుల పాఠశాలలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఒకరికొకరు గుర్తుపట్టి మిత్రులిద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

Updated Date - Jun 12 , 2026 | 05:34 AM