Share News

ఆర్టీసీ ప్రధాన ఆస్పత్రికి ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:26 AM

తార్నాకలోని ఆర్టీసీ ప్రధాన ఆస్పత్రి నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌(ఎన్‌ఏబీహెచ్‌) ఎంట్రీ లెవల్‌ గుర్తింపు పొందింది.

ఆర్టీసీ ప్రధాన ఆస్పత్రికి ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు

  • వైద్య బృందాన్ని అభినందించిన ఎండీ నాగిరెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): తార్నాకలోని ఆర్టీసీ ప్రధాన ఆస్పత్రి నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌(ఎన్‌ఏబీహెచ్‌) ఎంట్రీ లెవల్‌ గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, బృందాన్ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అభినందించారు. వైద్యుల సమష్టి కృషి, పట్టుదల, అత్యుత్తమైన ఆరోగ్య సేవలను అందించాలనే సంకల్పానికి ఇది నిదర్శనమని కొనియాడారు. ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఏబీహెచ్‌ సర్టిఫికేషన్‌ పొందడం సంతోషంగా ఉందని, అందరి కృషితోనే ఇది సాధ్యమైందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శైలజామూర్తి పేర్కొన్నారు. మెరుగైన వైద్య ేసవలు, నాణ్యత ప్రమాణాలకు ఇది గుర్తింపుగా నిలుస్తుందన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 04:26 AM