Share News

ఇంటి వద్దకే రామయ్య కల్యాణ తలంబ్రాలు

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:43 AM

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను నేరుగా భక్తుల ఇళ్ల వద్దనే...

ఇంటి వద్దకే రామయ్య కల్యాణ తలంబ్రాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను నేరుగా భక్తుల ఇళ్ల వద్దనే అందజేసేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. దేవాదాయ శాఖ సహకారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా భక్తులకు తలంబ్రాలను అందజేస్తారు. భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో, ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కేంద్రాల్లో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చు. రూ.151 చెల్లించి భక్తుల పేరు, ఇంటి చిరునామా, పిన్‌కోడ్‌ నెంబరు నమోదు చేస్తే చాలు. మరోవైపు బస్‌భవన్‌లో భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆవిష్కరించారు. భక్తులు ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ ఫోన్‌ నంబర్లు 040-23450033, 040-69440069లలో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీటీఎం(మార్కెటింగ్‌, కమర్షియల్‌) శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 06:43 AM