Share News

ముగిసిన ఆర్టీసీ ఎన్నికలు...

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:51 PM

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవా రం ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుం డా బ్యాలెట్‌ పద్ధతిలో ప్రశాంతంగా ముగిశాయి. రీజనల్‌ కార్యాలయం పరిధిలోని ఆరు డిపోల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వ రకు ఓటింగ్‌ ప్రక్రియ జరుగగా, ఓటు వే సేందుకు పోలింగ్‌ బూత్‌ల వద్ద ఉదయం నుం చే కార్మికులు బారులు తీరారు.

ముగిసిన ఆర్టీసీ ఎన్నికలు...

-ఓటు వేసేందుకు బారులు తీరిన కార్మికులు

-రీజియన్‌ పరిధిలో 95 శాతం పోలింగ్‌ నమోదు

-17న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి

మంచిర్యాల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవా రం ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుం డా బ్యాలెట్‌ పద్ధతిలో ప్రశాంతంగా ముగిశాయి. రీజనల్‌ కార్యాలయం పరిధిలోని ఆరు డిపోల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వ రకు ఓటింగ్‌ ప్రక్రియ జరుగగా, ఓటు వే సేందుకు పోలింగ్‌ బూత్‌ల వద్ద ఉదయం నుం చే కార్మికులు బారులు తీరారు. దశాబ్ద కాలం తరువాత ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుండటంతో కార్మికులు, కార్మిక సంఘా ల ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లే కుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్ర ధానంగా 12 యూనియన్లు బరిలో దిగగా, ఆది లాబాద్‌ రీజియన్‌లో మాత్రం రెండు యూని యన్ల మధ్యనే పోటీ నెలకొంది. ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఈయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) ఐక్యంగా పోటీ చే స్తుండగా, ఆ కూటమి టీఎస్‌ఆర్టీసీ ఎంప్లా యిస్‌ యూనియన్‌ పేరుతో బస్సు గుర్తుపై బ రిలోకి దిగగా, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎస్‌డబ్ల్యుయూ), స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరే షన్‌ (ఎస్‌డబ్ల్యుఎఫ్‌), తెలంగాణ వర్కర్స్‌ యూ నియన్‌ (టీడబ్ల్యుయూ) ఐక్యంగా అధికార కాం గ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్‌టీయూ సీతో జతకలిశాయి. ఆ కూటమి ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ పేరుతో బాణం గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగింది.

95 శాతం పోలింగ్‌ నమోదు...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ ముగిసే సరికి మొత్తంగా 95 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉ మ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల ఆర్టీసీ డి పోలో 403 ఓటర్లుగాను 394 మంది తమ ఓ టు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఆసిఫా బాద్‌ డిపో పరిధిలో 251 మంది ఓట ర్లకుగాను 235 మంది ఓటు హక్కును విని యోగించుకోగా, నిర్మల్‌ డిపో పరిధిలో 385 మంది ఓటర్లకుగాను 373 మంది, ఉట్నూరు డిపో పరిధిలో 112 మంది ఓటర్లకుగాను 106 మంది, ఆదిలాబాద్‌ డిపో పరిధిలో 433 మంది ఓటర్లకుగాను 399 మంది, భైంసా డిపో పరిధి లో 193 మంది ఓటర్లకుగాను 189 మంది ఓ టర్లు ఓటు వేశారు. ఇందులో ముగ్గురు ఆన్‌ లైన్‌ విధానంలో ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. ఇదిలా ఉండగా, సాయంత్రం 6.30 గంటలకు డిపోల వారీగా పోలైన ఓట్లను లె క్కించనున్నారు. ఆ వివరాలను రాష్ట్ర కార్యాల యానికి పంపనుండగా, ఈ నెల 14,15 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపట్టి, 17వ తేదీన ఆన్‌లైన్‌ చేసిన అనంతరం తుది ఫలితాలు వి డుదల చేసి, విజేతలను ప్రకటించనున్నారు.

Updated Date - Oct 09 , 2026 | 11:51 PM