Share News

kumaram bheem asifabad- సమ్మెతో నిలిచిన ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:20 PM

ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆ సంస్థ కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచే ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులను ఒక చోటి నుంచి మరొక చోటికి తరలిస్తున్న ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మె చేస్తున్న నేపథ్యంలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. సమ్మె మొదటి రోజు కాస్త ఉద్రిక్తత చోటు చేసుంది.

kumaram bheem asifabad- సమ్మెతో నిలిచిన ఆర్టీసీ బస్సులు
ఆసిపాబాద్‌లో ప్రైవేటు బస్సును అడ్డుకుంటున్న కార్మికులు

- పోలీసులతో కార్మికుల వాగ్వాదం

ఆసిపాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆ సంస్థ కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచే ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులను ఒక చోటి నుంచి మరొక చోటికి తరలిస్తున్న ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మె చేస్తున్న నేపథ్యంలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. సమ్మె మొదటి రోజు కాస్త ఉద్రిక్తత చోటు చేసుంది. పోలీసులు, రవాణా శాఖాధికారులు డిపో వద్దకు చేరుకొని అద్దె బస్సులు నడిపేలా చేస్తున్న ప్రయత్నాలు కొంత వరకు సఫలమైనప్పటికీ పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. కాగా ఆసిపాబాద్‌ డిపోలో మొత్తం 50 ప్రభుత్వ, 27 అద్దె బస్సులు నడుస్తున్నాయి. దీంతో ప్రతి రోజు రూ.16 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెతో మొదటి రోజు కేవలం ఏడు అద్దె బస్సులు మాత్రమే నవగా మిగితా బస్సులు ఆగి పోయాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె గురించి అవగాహన లేక వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రజలు బస్టాండ్‌ వద్ద ఎదురు చూస్తు ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద యం వేళ విద్యార్థులు బస్సులు అందుబాటులో లేక పోవడంతో ఇబ్బందులు పడ్డా ు. దీంతో ఆలోలకు అత్యధికంగా డబ్బులు చెల్లించి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చింది.

కాగా ఆర్టీసీ డిపో మేనేజర్‌ రాజశేఖర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ దేవపాలతో కలిసి స్థానిక సీఐ బాలాజీ వరప్రసాద్‌, సీఐ సతీష్‌, ఎంవీఐ మోహన్‌లు ప్రైవేటు బస్సులను నడిపే ప్రయత్నం చేశారు. అయితే ఏఐటీయూసీ నాయకులు దివాకర్‌, ఉపేందర్‌ల సూచనలతో అడ్డె బస్సుల డ్రైవర్లు కూడా డూఐ్యటీ చేయడానికి నిరాకరించడంతో కేవలం ఏడు బస్సులు మాత్రమే నడిచాయి. అధికారులు చేసిన ప్రతయ్నం పూర్తిగా ఫలించలేదు. డిపో నుంచి మొట్ట మొదట ఆదిలాబాద్‌కు వెళ్లడా నికి బయలుదేరిన అద్దె బస్సును బస్టాండ్‌ బయట ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక సీఐ బాలాజీ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని పక్కకు తప్పించి బస్సును పంపించేశారు. ఆ సమ యంలో ఇరువురి మధ్య కొంత తోపుటాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రతి బస్సుకు ఇద్దరేసి చొప్పున పోలీసు సిబ్బందిని కేటాయించి నడిపించారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..

ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌ అన్నారు. బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని బుధవారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, కౌన్సిలర్‌లు వెంకటేశ్వర్లు, బాలాకృష్ణ, సలాంబీన్‌ అహ్మద్‌, నాయకులు శ్రీనివాస్‌, అలీబీన్‌ అహ్మద్‌లతో కలిసి సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. తమ సంపూర్ణ మద్దతు కార్మికులకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు నిసార్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2026 | 11:20 PM