Share News

రేవంత్‌రెడ్డి ఆదేశంతోనే కేటీఆర్‌, హరీశ్‌ ఇళ్లవద్ద సీసీ కెమెరాల హ్యాక్‌

ABN , Publish Date - May 01 , 2026 | 05:44 AM

బాధ్యత లేని హోంమంత్రి పాలనలో పోలీసుశాఖ బలవుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కేటీఆర్‌, హరీశ్‌రావు ఇళ్లముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్‌ చేస్తున్నారని బీఆర్‌ఎస్‌...

రేవంత్‌రెడ్డి ఆదేశంతోనే  కేటీఆర్‌, హరీశ్‌ ఇళ్లవద్ద సీసీ కెమెరాల హ్యాక్‌

  • బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : బాధ్యత లేని హోంమంత్రి పాలనలో పోలీసుశాఖ బలవుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కేటీఆర్‌, హరీశ్‌రావు ఇళ్లముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్‌ చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు నుంచి ప్రయివేటు హ్యాకర్లను తీసుకొచ్చి ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని, దీనిపై సిట్‌ వేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఛార్జిషీట్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు పేర్లు పెట్టాలని అధికారులపై రేవంత్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. వారిని ఇరికించే ఉద్దేశంతోనే రెండో సిట్‌ వేశారన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చట్టబద్థంగా దేశ భద్రత కోసం జరుగుతుందని, ఏ ప్రభుత్వం ఉన్నా సాధారణమేనని పేర్కొన్నారు. ఈ కేసులో రాజకీయ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, 350మంది సాక్షులను విచారించినా ఇప్పటివరకు ఛార్జిషీట్‌ దాఖలు చేయలేదన్నారు. ఇదే కేసులో సీనియర్‌ జర్నలిస్టును ఇరికించారని, ఆయన సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటీషన్‌వేేస్త హరీశ్‌రావు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారని, ప్రభాకర్‌ రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్‌ చేశారని ఆరోపించారు. ఐపీఎస్‌ అధికారులకు సీఎం ఆదేశాలను పాటించొద్దని ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ కుమార్‌ సూచించారు.

Updated Date - May 01 , 2026 | 05:44 AM