అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ. 925 కోట్లు మంజూరు
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:03 PM
మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసేందుకు ప్ర త్యేకంగా రూ. 925 కోట్లు మంజూరైనట్లు ఎ మ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో సో మవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో దానికి సంబంధించిన వివరాలను వెల్ల డించారు.
సీఎం రేవంత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
కార్పొరేషన్ రూపురేఖలు మారుస్తా
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాల, నవంబర్ 2 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసేందుకు ప్ర త్యేకంగా రూ. 925 కోట్లు మంజూరైనట్లు ఎ మ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో సో మవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో దానికి సంబంధించిన వివరాలను వెల్ల డించారు. అంతకు ముందు నిధులు మంజూ రు చేసినందున సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటా నికి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మేయర్ ధర్ని మదూకర్‌తో కలిసి ఎమ్మెల్యే క్షీ రాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసి న సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధు లు మంజూరు కావడం సంతోషించతగ్గ విష యమన్నారు. నాలుగైదు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న ఇతర పార్టీల నాయకులు కరువు కాంగ్రెస్ చలవే అంటున్నారని, 50 ఏండ్ల ప్ర కృతి విధ్వంసానికి ప్రతిఫలమే ఈ కరువు ఛా యలని తెలిపారు. ఎల్‌నినో పరిస్ధితులపై ఎప్ప టికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుం దన్నారు. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులోకి ఈ మ ద్య కురిసిన అకాల వర్షాలతో నిండుగా ఉన్నా యన్నారు. అయితే ఎల్లంపల్లి నుంచి దాదాపు మూడు జిల్లాల ప్రజలకు తాగు నీరు అందు తున్నందున రెండో పంట సాగుకు విడుదల చేసే పరిస్ధితి లేదన్నారు.
వరల్డ్ బ్యాంకు నుంచి నిధుల విడుదల...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో అం డర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 925 కోట్లు మంజూరు చేయగా అందు లో వరల్డ్ బ్యాంకు నుంచి 70 శాతం అంటే రూ. 647.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తరుపున 30 శాతం అంటే రూ. 277.50 కోట్లను వెచ్చిం చామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో కా ర్పొరేషన్‌లోని అన్ని డివిజన్‌లలో అండర్ గ్రౌం డ్ డ్రైనేజీ పనులను చేపడతామన్నారు. దీం తో మంచిర్యాల నగర రూపురేఖలు పూర్తిగా మారుతాయన్నారు. ఈ సమావేశంలో డీసీసీ మాజీ అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, నగర కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు తూముల నరేష్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్య నారాయణ, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి భానేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జెల హేమలత పాల్గొన్నారు.