జిల్లాకు రూ. 500 కోట్ల కేటాయించాలి
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:41 PM
నాగర్‌కర్నూల్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రూ.500 కోట్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్య దర్శి వర్థం పర్వతాలు ప్రభుత్వాన్ని కోరారు.
- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు
కోడేరు, నవంబరు 28 (ఆంధ్రజ్యో తి) : నాగర్‌కర్నూల్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రూ.500 కోట్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్య దర్శి వర్థం పర్వతాలు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మండల కేంద్రం లోనిసీపీఎంకార్యాలయంలో మండల స్థాయి నాయకుల సమావేశం నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు ము ఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, మూడేళ్లలో ముఖ్యమంత్రి ప్రకటించిన అన్ని పథకాలకు నిధులు వెంటనే విడుదల చేయా లని కోరారు. మహిళలకు రూ. 2500 నగదు, వికలాంగులకు రూ.6000, వితంతువులకు, ఒంటరి మహిళ లకు రూ.4000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పి.నరసింహ, పి.శివ శంకర్, కాక వెంకటయ్య ఉన్నారు.