Share News

మినిట్యాంక్‌ బండ్‌ అభివృద్దికి రూ.2.31కోట్లు

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:13 PM

పట్టణంలోని ఊరు మందమర్రి మిని ట్యాంక్‌ బండ్‌ అభివృద్ధి కోసం రూ.2.31కోట్లు కేటా యించామని దీంతో ట్యాంక్‌ బండ్‌ సుందరీకరణ పనులు చేపడు తా రని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్‌ జి. వివేక్‌ వెంకటస్వామి తెలిపారు.

మినిట్యాంక్‌ బండ్‌ అభివృద్దికి రూ.2.31కోట్లు

ప్రజల వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు

మంత్రి వివేక్‌ వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, మార్చి21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఊరు మందమర్రి మిని ట్యాంక్‌ బండ్‌ అభివృద్ధి కోసం రూ.2.31కోట్లు కేటా యించామని దీంతో ట్యాంక్‌ బండ్‌ సుందరీకరణ పనులు చేపడు తా రని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్‌ జి. వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం 24వ వార్డు ఊరు మందమర్రి చెరువు వద్ద మి నీ ట్యాంక్‌ బండ్‌ అభివృద్ధి పనులను ఆయన కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తో కలిసి ప్రాంరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిధులతో ఉదయం ప్రజలు వాకింగ్‌ చేసుకోవడానికి వాకింగ్‌ట్రాక్‌, చిన్నారుల కోసం వివిధ రకాల బొమ్మలు కూడ ఏర్పాటు చేస్తామని అంతేగాకుండా ఓపెన్‌జిమ్‌ కూడ అందుబాటులోకి వస్తుందని తెలిపా రు. సాయంకాళం వేళల్లో ప్రజలు ఈ ట్యాంక్‌ బండ్‌ వద్ద కుటుం బాలతో కలిసి సేదే తీరే సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాకలవర్గం లేని మున్సిపాలిటిలో అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు మున్సిపాలిటిలో ప్రజా సమస్యల పరిష్కా రానికి మార్నింగ్‌ వాక్‌ చేపడుతూ వాటి సమస్యల పరిష్కారానికి చొర వ చూపుతానన్నారు. అదే విధంగా మున్సిపల్‌ కమిషనర్‌ తోపాటు అభివృద్ధి పనులపై చర్చించామని తెలిపారు. మున్సిపాలిటీలో జరు గుతున్న పురోగతి కూడ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపా రు. పనుల్లో జాప్యం చేయవద్దని కాంట్రాక్టర్లను ఆదేశించామని తెలి పారు. ఈట్యాంక్‌ బండ్‌ పనులు త్వరలోనే ప్రారంభంకానున్నా యని తెలిపారు. మందమర్రి పట్టణానికి అత్యంత ఆకర్షణీయంగా మార నుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిసనర్‌ రాజలిం గు, మున్సిపల్‌ డీఈ సుమతితో పాటు మున్సిపల్‌ సిబ్బంది కాంగ్రెస్‌ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు నోముల ఉపేందర్‌గౌడ్‌, బండి సదానందం,, పొల్లూరి లక్ష్మణ్‌, గుడ్ల రమేశ్‌, సట్ల సంతోష్‌, ఆకారపు రమేశ్‌, ఎండీ ఇసాక్‌, జావీద్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:13 PM