నోటీస్‌పై వివరణకు గడువు కోరిన రోహిత్‌రెడ్డి!
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:23 AM
మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం జారీ చేసిన షోకాజ్ నోటీ్‌సకు ...
తాండూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం జారీ చేసిన షోకాజ్ నోటీ్‌సకు వివరణ ఇచ్చేందుకు రోహిత్ రెడ్డి మరింత గడువు కోరినట్టు తెలుస్తోంది. ఆయన జైల్లో ఉన్న కారణంగా షోకాజ్ నోటీస్‌ను ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు. ఏడు రోజుల్లో నోటీస్‌కు సమాధానం ఇవ్వాలంటూ ఇచ్చిన గడువు పూర్తికావడంతో బీఆర్‌ఎస్ తాండూరు శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో జైల్లో, తర్వాత పోలీస్ కస్టడీలో ఉండటంతో రాతపూర్వకంగా వివరణ ఇవ్వలేనందున తనకు మరింత గడువు కావాలని మౌఖికంగా కుటుంబసభ్యుల ద్వారా ఆయన పార్టీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. జైల్లో ఉన్న రోహిత్‌రెడ్డి నుంచి నేరుగా వివరణ తీసుకోలేని పరిస్థితి ఉన్నందున పార్టీ మరింత గడువు ఇస్తుందా? లేక చర్యలు తీసుకుంటుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.