జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదల
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:46 AM
మొయినాబాద్ ఫాంహూస్ డ్రగ్స్ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం...
సైదాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్ ఫాంహూస్ డ్రగ్స్ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. మంగళవారం రోహిత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ పత్రాలు బుధవారం మధ్యాహ్నం జైలుకు చేరడంతో విడుదలయ్యారు. మార్చి 14న ఎస్‌వోటీ పోలీసులు రోహిత్‌రెడ్డి, అతడి సోదరుడు రితేష్ రెడ్డి, వ్యాపారవేత్త నమిత్ శర్మలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.