Share News

రోహిత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:25 AM

మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది..

రోహిత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వాయిదా

మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.సుజన మంగళవారం విచారణ చేపట్టగా.. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి. ప్రద్యుమ్నకుమార్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసు దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, మార్చి 15 నుంచి జైలులో ఉన్నారన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసేనని పేర్కొన్నారు. దురుద్దేశాలతో నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆయన కోరారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ.. నిందితుడు ఫాంహౌస్‌లో పార్టీలు నిర్వహించడం, డ్రగ్స్‌ సరఫరా చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఉన్నాయని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈనెల 28కి వాయిదా వేశారు.

Updated Date - Apr 22 , 2026 | 05:25 AM