నేటితో ముగియనున్న డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:08 AM
మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో నిందితులైన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి కస్టడీ గడువు సోమవారం ముగియనుంది.
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో నిందితులైన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి కస్టడీ గడువు సోమవారం ముగియనుంది. దీంతో వారిని పోలీసులు సోమవారం మరోసారి కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితులను ఇప్పటికే నాలుగు సార్లు కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. మరో ఐదురోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారు చెప్పారు. మరోవైపు రోహిత్‌రెడ్డి బెయిల్ కోసం సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. నిందితులకు హైకోర్టు బెయిల్ మంజారూ చేస్తుందా? లేదా మరోసారి కస్టడీకి తరలిస్తుందా అనేది సోమవారం తేలనుంది.