ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:00 AM
జిల్లాలో రహదారి ప్ర మాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రహదారి భద్రతపై సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రహదారి ప్ర మాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రహదారి భద్రతపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల పరిధిలో స్పీడ్ బ్రేకర్లు, ఇతర రోడ్డుభధ్రత సూచికలో ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై అనధికార వాహనాల నిలుపుదల, ని బంధనల ఉల్లంఘటన పట్ల కటిన చర్యలు తీసుకోవాలన్నారు. ద్విచక్రవాహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించేలా చూడాలన్నారు. రోడ్లపై వేగ ప రిమితి బోర్డులు, హెచ్చరిక బోర్డులు, జాగ్రత్త సూచిక బోర్డులను ఏర్పాటు చేయా లన్నారు. నిబంషధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రహ దారి ప్రమాదాలు మరణాలు తగ్గించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయం తో కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లాఅటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, సబ్ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.
-మాదక ద్రవ్యాల నియంత్రణపై సమీక్ష
మాదక ద్రవ్యాల నియంత్రణపై కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ పై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 133 మందిని అరెస్టు చేసి 35 మందిని డ్రగ్ డీ ఆడిక్షన్ కేంద్రాలకు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల నియంత్ర ణపై క్విజ్, డ్రాయింగ్ తదితర పోటీలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ విలాయత్ అలీ పాల్గొన్నారు.