Share News

kumaram bheem asifabad- నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు

ABN , Publish Date - Aug 28 , 2026 | 10:54 PM

కాగజ్‌నగర్‌ పట్టణ అభివృద్ధిలో కీలకమైన రోడ్డు విస్తరణ పనులు కాగజ్‌నగర్‌లో నత్తనడకన సాగుతున్నాయి. ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి రైల్వే గేటు వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మూడు నెలల క్రితమే అధికారులు రహ దారిపై ఉన్న అక్రమణలు తొలగించారు. దీంతో ఇక పనులు శరవేగంగా జరుగుతాయని పట్టణవాసులు ఆశించారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి.

kumaram bheem asifabad- నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు
కాగజ్‌నగర్‌లో అక్రమణలను తొలగిస్తున్న మున్సిపల్‌ అధికారులు(ఫైల్‌)

కాగజ్‌నగర్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణ అభివృద్ధిలో కీలకమైన రోడ్డు విస్తరణ పనులు కాగజ్‌నగర్‌లో నత్తనడకన సాగుతున్నాయి. ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి రైల్వే గేటు వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మూడు నెలల క్రితమే అధికారులు రహ దారిపై ఉన్న అక్రమణలు తొలగించారు. దీంతో ఇక పనులు శరవేగంగా జరుగుతాయని పట్టణవాసులు ఆశించారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. ఆక్రమణలు తొలగింపు ఇంకా నత్తనడకనే కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. రాజీవ్‌ గాంధీ చౌరస్తా సమీపంలో ఉన్న ఎస్పీఎం క్వార్టర్ల తొలగింపు కొద్దిమేర చేపట్టినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఈ పనులు చేపట్టలేదు. రాజీవ్‌ గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేటు వరకు ఉన్న వ్యాపారసముదాయాలను తొలగింపు చేసేందుకు గడువు ఇచ్చినప్పటికీ కూడా పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది.

ట్రాఫిక్‌ ఇబ్బందులు..

రోడ్డు విస్తరణ పనులు ఆలస్యమవుతుండ డంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తునతున్నా యి. ఒక వైపు రోడ్డు విస్తరణ పనులు కాక పోవడంతో మరో వైపు పండుగలు వస్తుండడంతో మార్కెట్‌లో రద్దీ పెరుగడంతో నడిచేందుకు కూడా ఇబ్బందిగా మారుతోంది. ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి రైల్వే గేటు, మార్కెట్‌ ఏరియాలో వివిధ పండుగ సమయంలో వివిధ వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆయా వార్డుల నుంచి ప్రజలు వస్తుండడంతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడుతోంది. కనీసం కాలినడక సైతం పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. గంటల తరబడి ట్రాఫిక్‌ సమస్య ఉంటుంది. అధికారులు త్వరితగతిన అభివృద్ధి పనులు చేపడితే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని పలువురు చెబుతున్నారు. మున్సిపాల్టీ అభివృద్ది కోసం విడుదలైన రూ.18.70 కోట్ల నిధులతో కూడలి అభివృద్ధి చేపేట్టందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ విస్తరణ పనులు జరుగక పోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని అధికారులు, నాయకులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రోడ్డు విస్తరణ కోసం అక్రమణలను తొలగించడం ఒక దశ మాత్రమేనని, ఆ తర్వాత రోడ్డు నిర్మాణాం, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌, ట్రాఫిక్‌ నిర్వహణ వంటి పనులను సమగ్రంగా పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 28 , 2026 | 10:54 PM