రోడ్డు భద్రత సామాజిక బాధ్యతగా భావించాలి
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:53 AM
రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్ శాఖ,
కోనరావుపేట,ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ గ్రామంలో సోమవారం అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే హాజరయ్యారు. గ్రామ రోడ్‌సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్తులతో అరైవ్. అలైవ్‌పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యుద్ధాలు, వ్యాధుల ఇతర కారణాలతో ఎక్కువ మరణాలు జరగడం లేదని, రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవా లని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని అన్నారు. భవ్యిషత్ ప్రణాళికలు రచించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్ర మాన్ని అమలు చేస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక ప్రణాళిక, ఆచరణతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిన జాబితాలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని కొనియాడారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యం లో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమా లు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరిం చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ ఛైర్మన్ తాళ్ళపల్లి ప్రభాకర్, గ్రామ సర్పంచ్ శ్రీహరి, సర్పంచులు ఫోరం మండలాద్యక్షుడు బోయిని దేవరాజ్, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ కాంగ్రెస్ జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నాలుక సత్యం, తాళ్లపల్లి ప్రభాకర్, నాయిని ప్రభాకర్ రెడ్డి, మానుక సత్యం, కె బాల్ రెడ్డి, బుర్ర రమేష్, సిద్దిరాజు, నందు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.