రహదారి భద్రత నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:34 PM
వాహనదారులు రహదారి భ ద్రత నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని కలెక్ట ర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రూర ల్ సీఐ గోపతి రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్య క్రమానికి డీసీపీ భాస్కర్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి హాజర య్యారు.
కలెక్టర్ కుమార్ దీపక్
హాజీపూర్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : వాహనదారులు రహదారి భ ద్రత నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని కలెక్ట ర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో రూర ల్ సీఐ గోపతి రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్య క్రమానికి డీసీపీ భాస్కర్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి హాజర య్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం అంటే ఒక కుటుం బానికి జరిగే ప్రమాదమని తెలిపారు. రహదారి భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. ప్రభుత్వం సురక్షితమైన ప్రయాణం కోసం రహదారులను నిర్మించిందని, ఈ క్రమంలో రహదారులపై కేజీవీల్స్ నడ పకూడదని, నిబంధనలు ఉల్లంఘించి రహదారులకు దెబ్బతి నేలా వాహనాలు నడిపడినట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చే యాలన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు వైద్యులతో కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను పంపిణీ చేశారు. అంతకు ముందు కలెక్టర్ మండలంలోని పడ్తన్‌పల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిం చారు. కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రత పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, తహసీల్దార్ పుష్పలత, ఎస్‌ఐ కిరణ్‌కుమార్, సర్పంచు రాంరెడ్డి,కార్పోరేటర్ త్రివేణిరాజయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ శిల్పశ్రీనివాస్‌రావు, భూమన్న, ఆత్మ చైర్మన్ మురళీ తదితరులు పాల్గొన్నారు.