రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:36 PM
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని తప్పనిసరిగా ట్రాఫిక్ నియ మనిబంధనలు పాటించడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరుగవని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు.
డీసీపీ భాస్కర్
మందమర్రిటౌన్,(రామకృష్ణాపూర్)సెప్టెంబరు22(ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని తప్పనిసరిగా ట్రాఫిక్ నియ మనిబంధనలు పాటించడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరుగవని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. మంగళవారం రామకృష్ణాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారీమైసమ్మ జాతీయ ర హదారి దగ్గర సర్వీసు రోడ్డును ఆయన పర్యావేక్షించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఈ రోడ్డుకు గతంలోసెంట్రల్ లైటింగ్ సిస్టం లేదని తమ దృష్టికి రాగా సెంట్రల్‌లైంగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అండర్‌బ్రిడ్జీ, సర్వీసు రోడ్డు ఏరియాలో నిర్మానుశ్యంగా చీకటి ప్రదేశం ఉండడం వల్ల సెంట్రల్ లైటింగ్ సిస్టంకు సంబంఽచి 14 పోల్స్ నేషనల్ అథారిటి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. కొత్త గ్రామాల ప్రజలు సర్వీసు రోడ్డు లేక ఏరియాలో చాలా ప్రమాదాలు జరుగు తున్నాయని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొ ని వేగవంతంగా సెంట్రల్ లైటింగ్ సిస్టంకు పూనుకున్నామన్నారు. జా తీయ రహదారిపై ప్రయాణీకులు తప్పనిసరిగా రోడ్డు భద్రతను దృష్టి లో పెట్టుకోవాలని వాహనాలపై వెళ్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడడం, హె ల్మెట్ లేకుండా ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. ప్రజల రక్షణే పోలీ సుల బాధ్యత అని దీనిలో భాగంగా తాము కూడ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సీపీ అంబర్‌కిషోర్‌ఝా ఆధేశాలతో పాటు జిల్లా వ్యాప్తంగా సర్వీసు రోడ్డుతో పాటు నేషనల్ రోడ్లను పరిశీలించి లైటింగ్స్ ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్‌ఐ శ్రీధర్, పాల్గొన్నారు.