kumaram bheem asifabad-రోడ్డు భద్రత అందరి బాధ్యత
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:04 PM
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ రాజశేఖర్ అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రవాణా శాఖ, రోడ్డు రవాణా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు ఎస్పీ నితికా పంత్, జిల్లా రవాణాధికారి శంకర్‌నాయక్, జిల్లా ఫైర్ అధికారి భీమయ్యతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరీ బాధ్యత ఎంతో కీలకమని చెప్పారు
ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ రాజశేఖర్ అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రవాణా శాఖ, రోడ్డు రవాణా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు ఎస్పీ నితికా పంత్, జిల్లా రవాణాధికారి శంకర్‌నాయక్, జిల్లా ఫైర్ అధికారి భీమయ్యతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరీ బాధ్యత ఎంతో కీలకమని చెప్పారు. ఆర్టీసీని ప్రమాదాల రహిత ప్రయాణంగా రూపొందించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో ఉందన్నారు. డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచిం చారు. ఒక్కరి నిర్లక్ష్యంతో ఎంతో మంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పారు. వాహనం నడిపేటప్పుడు ప్రతీ క్షణం విలువైనదేని గుర్తుంచుకోవాలన్నారు. అంతకు ముందు ఎస్సీ నితికా పంత్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తప్పని సరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. అలా చేస్తే రోడ్డు ప్రమాదాల నివారణ వంద శాతం సాధ్యమవుతుం దన్నారు. జిల్లాలో 2024-24తో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్యలో పెద్దగా మార్పు లేదని చెప్పారు. అయితే దానిని పూర్తిగా తగిగంచాల్సి అవసరం ఉందన్నారు. ప్రజలు సహకరించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు బాధ్యతగా పాటుపడు తామని కలెక్టర్ అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, జిల్లా వైద్యాధికారి సీతారాం, ఏఎంవీఐలు రాజమల్లు, సంజయ్, రాజశేఖర్, విక్రమ్, వైద్యులు వినోద్‌కు మార్, ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య అందించాలి
రెబ్బెన, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీ విద్యాలయాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈదో దీపక్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వంటల శాల, సామగ్రి నిలువ గది, మెనూ పట్టిక, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పౌష్టిక విలువలతో కూడిన మెనూ అమలు చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాలని తెలిపారు. వంటశాల, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వార్షిక పరీక్షలలో వంద శాతంఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక రూపొందించి సబ్జెక్టులలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఉదయం వేడి నీరు అందించాలని సూచించారు. వారి వెంట డీపీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో శంకరమ్మ, ఎంఈవో వెంకటేశ్వర్లు, ఎస్‌వో, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.