Share News

kumaram bheem asifabad- రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Apr 09 , 2026 | 10:39 PM

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలం నుంచి ప్రజాపాల ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర డీజీపీ శిధర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గురువారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, రవాణా, వైద్య, విద్య, రహదారులు భవనాలు, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌శాఖల అధికారులతో రవాణా భద్రత, అరైవ్‌- అలైవ్‌ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ

kumaram bheem asifabad- రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలి
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌, జిల్లా అధికారులు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలం నుంచి ప్రజాపాల ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర డీజీపీ శిధర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గురువారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, రవాణా, వైద్య, విద్య, రహదారులు భవనాలు, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌శాఖల అధికారులతో రవాణా భద్రత, అరైవ్‌- అలైవ్‌ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 18 వరకు అరైవ్‌- అలైవ్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రహదారి భద్రతపై గ్రామసభలు నిర్వహించాలన్నారు. రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రహదారి ప్రమాదాల వల్ల జరిగే నస్టాలపై గ్రామ సభలలో చర్చించాలని తెలిపారు. ఈ నెల 14వ తేదీన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రజలు, వాహనదారులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ నిర్వహించాలని చెప్పారు. లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి కార్యాలయంలో ఉద్యోగులు, అధికారులకు రహదారి భద్రత సూత్రాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌, కార్లు నడిపే వారు సీట్‌ బెల్ట్‌ తప్పని సరిగా ధరించాలని తెలిపారు. ప్రతి నెలా జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన రహదారి భద్రత కమిటీ సమావేశాలు నిర్వహించి ప్రమాదాలు నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతీ ప్రయాణికుడు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవా లని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ కెహరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, పోలీసు, రవాణా విద్య, వైద్య వైద్యం, రహదారుల భవనాల శాఖ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రభుత్వం చేపట్టిన అరైవ్‌- అలైవ్‌ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా చేపడుతామని చెప్పారు. ప్రతీ రోజు జిల్లాలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 10:39 PM