Share News

kumaram bheem asifabad- రహదారి నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Nov 26 , 2026 | 10:46 PM

వాహన ప్రమాదాలను నివారించడానికి ప్రతీ ఒక్కరు రహదారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశానికి ఎస్పీ నితికాపంత్‌తో కలిసి హాజరయ్యారు

kumaram bheem asifabad- రహదారి నిబంధనలు పాటించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వాహన ప్రమాదాలను నివారించడానికి ప్రతీ ఒక్కరు రహదారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశానికి ఎస్పీ నితికాపంత్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రహదారులపై వాహనాలు నిలిపే విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలన్నారు. రహదారులపై గుంతలను పుడ్చాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే చోట వేగ నియంత్రణ సూచిక బోర్డులు, రక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారుల మూలమలుపుల వద్ద చెట్ల పొదలను తొలగించాలని బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించాలన్నారు. రహదారులపై పశువులు సంచరించకుండా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపకుండా చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్పీలు అశోక్‌, వహిదుద్దీన్‌, సంబంఇతశాఖల అధికారులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాల రవాణాపై దృష్టి సారించాలి

జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణాచ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ నితికాపంత్‌తో కలిసి సంబందితశాఖల అధికారులతో మాదక ద్రవ్యాల నివారణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గంజాయిసాగు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి సాగుచేసే వారిని, రవాణా చేసే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాల, కళాశాలలకు 100 మీటర్లలోపు గుట్కా, జర్థా, బెల్టుషాపులు నిర్వహించకూడదని చెప్పారు. ఆయా పరిధిలోని షాపులలో విస్తృత తనిఖీలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగంవల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఎస్పీ నితికాపంత్‌ మాట్లాడుతూ గతనెల గంజాయి రవాణా చేసే వారిపై అరు కేసులు నమోదు చేశామని చెప్పారు. గంజాయి సాగు, రవాణా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించి విస్తృత తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం జిల్లాస్థాయి అధార్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి ఒక్కరు అధార్‌కార్డు కలిగి ఉండాలని ముఖ్యంగా పీవీటీజీ, అంగన్‌వాడీ పిల్లలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్పీలు అశోక్‌, వహిదుద్దీన్‌, సంబందితశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 10:46 PM