Share News

kumaram bheem asifabad- రహదారి నిబంధనలను పాటించాలి

ABN , Publish Date - Apr 14 , 2026 | 10:37 PM

వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవా లని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండు ప్రాంతంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్‌- అలైవ్‌ కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, జిల్లా రవాణాధికారి రాంచందర్‌లతో కలిసి హాజరయ్యారు. రహదారి భద్రత పోస్టర్లను కలెక్టర్‌ కె హరిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు

kumaram bheem asifabad- రహదారి నిబంధనలను పాటించాలి
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిపాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవా లని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండు ప్రాంతంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్‌- అలైవ్‌ కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, జిల్లా రవాణాధికారి రాంచందర్‌లతో కలిసి హాజరయ్యారు. రహదారి భద్రత పోస్టర్లను కలెక్టర్‌ కె హరిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లడుతూ అంబేద్కర్‌ ఆశయాల ప్రకారం ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. ప్రజలు చైతన్యవంతులైతే రోడ్డు భద్రత సాధ్యమని తెలిపారు. జిల్లాలో ప్రతి వాహదారుడు రహదారి నిబంధనలను పాటించి రహదారి ప్రమాదాలు జరగకుండా సహకరించాలని తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని కారణంగా ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కారోలో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పని సరిగా ధరించాలని చెప్పారు. అతి వేగంగా వాహనాలు నడపడం, రాంగ్‌ రూట్‌లో వెళ్లడం, త్రిబుల్‌ రైడింగ్‌ చేయడం ప్రమాదానికి కారణాలు అవుతున్నాయని తెలిపారు. వీటిపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అనంతరం రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కేంద్రంలోని వయో వృద్ధుల డే కేర్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్‌ ఏరియాలో మంగళవారం మహిళా, పిల్లల, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రణాయ్‌ వయో వృద్ధల డే కేర్‌ సెంటర్‌ను ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌లతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయో వృద్ధులకు డే కేర్‌ సెంటర్‌ ద్వారా మెరుగైన సేవలు లభిస్తాయని చెప్పారు. సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సమన్వయంతో కృషి చేస్తుందని తెలిపారు. డే కేర్‌ సెంటర్‌ ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగకరమని కొనియాడారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, సెక్షన్‌ పీల్డ్‌ రెస్పాన్స్‌ అధికారి రవి, సర్పంచ్‌ పోచయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 10:37 PM