Share News

kumaram bheem asifabad- రోడ్డు ప్రమాదాలను నివారించాలి

ABN , Publish Date - Apr 15 , 2026 | 10:21 PM

ప్రతీ పౌరుడు రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండి ప్రమాదాలను నివారించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌లో బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులతో రహదారి నిబంధనలపై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి డీఈవో లలిత, జిల్లా రవాణాధికారి రాంచందర్‌తో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు.

kumaram bheem asifabad- రోడ్డు ప్రమాదాలను నివారించాలి
ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ కె హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిపాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రతీ పౌరుడు రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండి ప్రమాదాలను నివారించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌లో బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులతో రహదారి నిబంధనలపై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమానికి డీఈవో లలిత, జిల్లా రవాణాధికారి రాంచందర్‌తో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు రహదారి నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాల న్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రహదారి నిబంధనలపై వివరిం చాలన్నారు. తప్పని సరిగా హెల్మెట్‌, సీటు బెల్టు ధరించి ప్రయాణం చేయాలన్నారు. విద్యార్థులు పాఠశాల ప్రవేశంలోని రహదారి దాటే సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలను తప్పని సరిగా పాటించాలన్నారు. ప్రతి పాఠశాలలో రహదారి నిబంధ నలపై సైన్‌ బోర్డు ఉండేలా చర్యలు తీసేఉకోవాలని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని చేయకూడదన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడకూడదన్నారు. వాహనాలను వేగంగా నపడ కూడదని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడుతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంఈవో సుభాష్‌, రవాణా, విద్యాశాఖాధికారులు, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 10:21 PM