kumaram bheem asifabad-రోడ్డు ప్రమాదాలను నివారించాలి
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:11 PM
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, రహదారి, భవనాల శాఖ ఇంజనీరింగ్, నేషనల్ హైవే రవాణా, విద్యుత్ శాఖ, వైద్య, విద్య శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు.
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, రహదారి, భవనాల శాఖ ఇంజనీరింగ్, నేషనల్ హైవే రవాణా, విద్యుత్ శాఖ, వైద్య, విద్య శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తరుచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వేగ నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వాహన దారుడు సీటు బెల్టు, ద్విచక్ర వాహన దారుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో వాహనాల రద్దీ లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారని వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాటిని తొలగించాలన్నారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాలలో సర్కిల్ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి ప్రమాదాలు జరుగకుండా సంబంధింత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
గంజాయి రవాణాపై కఠినంగా వ్యవహరించాలి
జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా చేసిన వారిపై కఠినంగా వ్యవరిం చా లని కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్‌డీఓ లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, మ త్తు పదార్థాలను రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి సాగు జరగకుండా రెవెన్యూ, అటవీ, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, వాహన చోదకులకు గంజాయి మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. కళా బృందాల చేత గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టాలన్నారు. పాన్ టేలాలు, పాఠశాలల పరిసర షాపుల్లో తనిఖీ నిర్వహించాలని సూచించారు. మెడికల్ షాపులలో అధిక మోతాదు మందులను విక్రయించకుండా సంబంధిత శాఖాధికారులు పర్యవేక్షించాలన్నారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వ్లల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.