kumaram bheem asifabad- రోడ్డు ప్రమాదాలను నివారించాలి
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:53 PM
జిల్లాలో రహదారి ప్రమాదాలు జరుగకుండా ముందస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై సంబంధితశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారి ప్రమాదాలు జరుగకుండా ముందస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి రహదారి భద్రత, ప్రమాదాల నివారణపై సంబంధితశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. రహదారులపై పశువుల సంచారం లేకుండా పశువుల యాజమానులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రధాన రహదారులు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో పశువులు, కుక్కలు వాహనాలకు అడ్డం రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఈ ఆంశంపై దృష్టి సారించాలని తెలిపారు. అర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారులపై గుంతల మరమత్తులు వెంటనే చేపట్టాలని, కళాశాలలు, పాఠశాలల్లో రహదారి నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు, వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపకుండా,ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకొవాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడుపకుండా తనిఖీలు చేపట్టాలని,మద్యంతాగి వాహనాలు నడిపే వారిపై డ్రంక్‌అండ్‌డ్రైవ్ కేసులు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్, డీపీవో భిక్షపతి, పీఆర్‌ఈఈ ధర్మేందర్, జిల్లా రవాణాశాఖ అధికారలు, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించాలి:
జిల్లాలో అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయంతో పాటు పరిహరం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌ల్లో ఎస్పీ నితికా పంత్, జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరిలతో కలిసి డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల క్రింద బాధితులకు న్యాయం, పరిహరం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 39 కేసులు నమోదు అయ్యాయని వివరించారు. ఈ కేసులనుక్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగేల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పరిహరం మంజూరుకు ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్, ఎస్సీ సంక్షేమాధికారి అశోక్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సిడాం అర్జు, గోపాల్‌నాయక్, కేశవరావు, గణేష్, గంగుబాయి, తదితరులు పాల్గొన్నారు.