రక్తపుటేరులు..
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:39 PM
జీవనోపాధి కోసం పనులకు వెళ్తున్న చిరుద్యోగుల కుటుంబాల్లో అం తులేని విషాదం అలుముకుంది. నవ్వుతూ అప్పటి వరకు ఆటోలో ప్రయాణం చేసిన వారు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం నస్పూర్ పట్టణం 63వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
నస్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...
ఆటో లారీ ఢీ: నలుగురు మహిళల మృతి..
మరో నలుగురికి తీవ్ర గాయాలు
చిరుద్యోగుల కుటుంబాల్లో విషాదం...
==================
నస్పూర్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జీవనోపాధి కోసం పనులకు వెళ్తున్న చిరుద్యోగుల కుటుంబాల్లో అం తులేని విషాదం అలుముకుంది. నవ్వుతూ అప్పటి వరకు ఆటోలో ప్రయాణం చేసిన వారు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం నస్పూర్ పట్టణం 63వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో షాపిం గ్ మాల్‌లో పని చేసే నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలకు గురైయ్యారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ...మంద మర్రి మండలం గుడిపెల్లి, వెంకటపూర్, పొన్నారం గ్రా మాలకు చెందిన పలువురు మహిళలు మంచిర్యాల పట్ట ణంలోని షాపింగ్ మాల్స్‌లో పని చేస్తూ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారు. రోజు మాదిరిగానే గ్రామానికి చెందిన ప్రశాంత్ ఆటోలో వీరంగా బయలు దేరారు. న స్పూర్ వద్దకు రాగానే అటోకు ఎదురుగా వచ్చిన మోటర్ సైకిల్‌ను తప్పించడానికి డ్రైవర్ కుడివైపు మళ్లించాడు. అటూ వైపు నుంచి శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్నవారందరూ చెల్లా చెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గా యపడ్డ చింతకుంట్ల లక్ష్మి(30), అగ్గు సౌందర్య (35)లు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలకు గురైన తొగరి సుమలత (25), తొటపల్లి సోనియా(20)లు మం చిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెం దారు. తీవ్రంగా గాయపడ్డ రాంటెంకి దివ్యవాణి, నరమళ్ల లక్ష్మి, సెగ్యామా ప్రశాంత్‌లను కరీంనగర్, సల్లూరి అను షా, వరంగల్ అసుపత్రులకు తరలించారు. కాగా అనుషా పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద స్థలానికి నస్పూర్ పోలీసులు చేరు కుని గాయ పడిన వారిని మంచిర్యాల ప్రభుత్వాపత్రికి తరలించారు. సమా చారం అందుకున్న సీఐ రవీందర్, ఎస్సై తహసినోద్దిన్‌లు సంఘటన స్థలానికి చేరుకుని గాయాలకు గురైన వారిని అసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోపతి రవీందర్ తెలిపారు.
కూలి పనులతోనే కుటుంబం గడిచేది..
మృతి చెందిన వారి కుటుంబాలు నిరుపేదలు కావడంతో కూలీ పనులు చేస్తేనే వారి జీవనం సాగుతుంది. ఉన్న ఊళ్లో కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్తుండగా ఇంటర్, డిగ్రీ వరకు చదివిని ఈ యువతులు మం చిర్యాలలోని పలు షాపింగ్ మాల్స్‌లో పని చేస్తూ కుటుంబానికి సహాయపడుతున్నారు.
ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు..
రోడ్డు ప్రమాదం నాలుగు కుటుబాలను విషాదంలోకి నెట్టివేసింది. కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వా సుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న తీరు అందర్ని కలచివేసింది. గుడిపెల్లికి చెందిన అగ్గు సౌందర్య ప్రభుత్వ అసుపత్రిలో స్నేహ ఎన్జీవో తరపున నర్సుగా పని చేస్తుం ది. ఇక్కడ దాదాపు ఆమె మూడేళ్లుగా పని చేస్తుందని మృతురాలి సోదరుడు తెలిపారు. చింతకుంట్ల లక్ష్మి ఇం టర్ వరకు చదుకుని పట్టణంలో ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తుంది. తల్లి అమ్మక్క, సోదరుడు సాయి కుమార్ ఉన్నారు. తొగరి సుమలత కూడా షాపింగ్‌లో పని చేస్తుంది. ఆమె తండ్రి రాజబాబు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. తొటపల్లి సోనియా తల్లిదండ్రులు వ్య వసాయ కూలీలు. స్వగ్రామం కాసీపేట మండలం ధర్మా రావు పేట గ్రామం, అయితే పొన్నారంలోని ఆమె పెద్ద మ్మ వద్ద ఉంటూ షాపింగ్ మాల్‌కు వెళ్తూంది. నలుగురి మృతదేహాలను ఆస్పత్రిలో ఉంచడంతో అక్కడ బాధిత కుటుంబ సభ్యుల రోధనలతో నిండిపోయింది.
ఫ పరిమితికి మించి ప్రయాణం...
ఆటోలో పరిమితికి మించి ఎక్కువ మందిని ప్రయా ణికులను తరలించడం వలనే ప్రమాద స్థాయి పెరిగిం దనే విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్‌తో కలిసి ప్రమా దా నికి గురైన ఆటోలో మొత్తం ఎనిమిది ఉన్నట్లు వెల్లడైం ది. నిబంధనలకు విరుద్దంగా మితిమీరి ఎక్కవ మందిని ఎక్కించారు.
గ్రామాల్లో విషాదం...
మందమర్రిరూరల్/కాసిపేట నస్పూర్‌లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంతో స్వగ్రామం మంద మర్రి మండలంలోని పొన్నారం, వెంకటాపూర్‌లో విషాదం అలుముకుంది. ప్రమాదంలో వెంకటాపూర్‌కు చెందిన సుమ లత, అగ్గు సౌందర్య, పొన్నారం గ్రామానికి చెందిన చింత కింది లక్ష్మీ, సోనిలు మృతిచెందారు. పొన్నారం గ్రామానికి చెందిన లక్ష్మీకి ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మం జూరు కాగా నిర్మాణంలో ఉంది. డిగ్రీ వరకు చదువు కున్న సోనిది కాసిపేట మండలంలోని ధర్మా రావుపేట గ్రామం. సోని చిన్నమ్మ వేల్పుల లక్ష్మీ దగ్గర ఉంటూ మంచిర్యాలలో పనిచేస్తుంది. విషయం తెలుసు కున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ తక్షణ సహాయంగా మృతిచెందిన వారికి రూ. 25 వేలు. గాయాలైన వారికి రూ. 10 వేలను అందజేశారు.