Share News

ఫైర్‌ ఉడ్‌ బ్లోయర్‌ స్టవ్‌లకు డిమాండ్‌!

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:59 AM

వాణిజ్య గ్యాస్‌ సరఫరా అంశంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో హోటల్‌, మెస్‌, క్యాంటీన్‌, హాస్టళ్ల నిర్వాహకులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు.

ఫైర్‌ ఉడ్‌ బ్లోయర్‌ స్టవ్‌లకు డిమాండ్‌!

  • గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పెరుగుతున్న వినియోగం

హైదరాబాద్‌ సిటీ, శేరిలింగంపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య గ్యాస్‌ సరఫరా అంశంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో హోటల్‌, మెస్‌, క్యాంటీన్‌, హాస్టళ్ల నిర్వాహకులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా పలువురు ఫైర్‌ ఉడ్‌ బ్లోయర్‌ స్టవ్‌ల వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నారు. సంప్రదాయ కట్టెల పొయ్యలకు ఈ ఫైర్‌ ఉడ్‌ బ్లోయర్‌ స్టవ్‌లు ప్రత్యామ్నాయంటున్నారు వ్యాపారులు. సంప్రదాయ కట్టెల పొయ్యిల నుంచి పొగ అధికంగా వెలువడుతుంది. అలాగే, మంటను నియంత్రిచడం సాధ్యం కాదు. కానీ, ఫైర్‌ ఉడ్‌ బ్లోయర్‌ స్టవ్‌లను మాత్రం గ్యాస్‌ స్టవ్‌ల మాదిరిగానే వినియోగించుకోవచ్చు. ఫైర్‌ ఉడ్‌ బ్లోయర్‌ల నుంచి పొగ తక్కువుగా రావడమే కాక మంటను కూడా నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఎల్‌పీజీ స్టవ్‌లతో పోలిస్తే వంట కూడా వేగంగా చేసుకోవచ్చు. కట్టెలు లేదంటే మరేదైనా వ్యర్థాలను ఈ పొయ్యిలో మండించుకోవచ్చునని వ్యాపారులు చెబుతున్నారు. టీస్టాల్స్‌, కర్రీ పాయింట్లు, మెస్‌లు, హాస్టల్స్‌ లాంటి చోట్ల ఈ బ్లోయర్లు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. హైదరాబాద్‌, కాప్రా సమీపంలోని ఈ ఫైర్‌ ఉడ్‌ బ్లోయర్ల ఓ డీలర్‌ మాట్లాడుతూ.. ఈ పొయ్యిలను సాధారణంగా కాస్ట్‌ ఐరన్‌, మైల్డ్‌ స్టీల్‌తో త యారు చేస్తారని, కట్టెలే వాడినా దాదాపు 80ు పొగ ఈ పొయ్యిల ద్వారా తగ్గుతుందన్నారు. కాగా, ఆహార వ్యాపారంలో ఉన్నవారు ఈ ఫైర్‌ ఉడ్‌ బ్లోయర్‌ స్టవ్‌ల కొనుగోలుకు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. రెండ్రోజులుగా ఈ స్టవ్‌ల అమ్మకాలు, ఆర్డర్లు పెరిగాయని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు. ఆహార వ్యాపారంలో ఉన్నవారు ఒక్కో స్టవ్‌కు రూ.35,000కుపైగా ఖర్చు చేస్తున్నారని, కొందరు రెండు లేదా మూడు స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

Updated Date - Mar 12 , 2026 | 04:59 AM