Share News

పెరుగుతున్న బ్లడ్‌ క్యాన్సర్‌

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:08 AM

దేశంలో బ్లడ్‌ క్యానర్‌ కేసులు పెరుగుతున్నాయని, బ్లడ్‌ క్యాన్సర్‌పై పోరాడటం అంటే వైద్య చికిత్సకు సంబంధించినది మాత్రమే కాదని, మానసిక బలం, ఆర్థిక మద్దతు, సమాజ అవగాహన కూడా అవసరమని...

పెరుగుతున్న బ్లడ్‌ క్యాన్సర్‌

  • నగరాల్లో ల్యుకేమియా, లింఫోమా మైలోమా అధికం

  • యశోద గ్రూప్‌ ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ జీఎస్‌ రావు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): దేశంలో బ్లడ్‌ క్యానర్‌ కేసులు పెరుగుతున్నాయని, బ్లడ్‌ క్యాన్సర్‌పై పోరాడటం అంటే వైద్య చికిత్సకు సంబంధించినది మాత్రమే కాదని, మానసిక బలం, ఆర్థిక మద్దతు, సమాజ అవగాహన కూడా అవసరమని యశోద గ్రూప్‌ ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ జీఎస్‌ రావు తెలిపారు. హెమటాలజీ వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు(ఏఐ) భాగస్వామ్యంపై హైటెక్‌ సిటీలోని యశోద ఆస్పత్రిలో శనివారం అంతర్జాతీయ సదస్సు ‘దక్కన్‌ హెమటోలింక్‌ 3.0’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2022లో 14.6 లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 15.7 లక్షలకు చేరిందని, వాటిలో బ్లడ్‌ క్యాన్సర్లు గణనీయంగా ఉన్నాయని వివరించారు. నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌ ప్రకారం ల్యుకేమియా, లింఫోమా మైలోమా కేసులు హైదరాబాద్‌ వంటి నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్‌ జీఎస్‌ రావు తెలిపారు. సీనియర్‌ హెమటాలజిస్ట్‌ డాక్టర్‌ గణేష్‌ జైషెట్వార్‌ మాట్లాడుతూ.. బ్లడ్‌ క్యాన్సర్‌ ఇకపై మరణశిక్ష కాదని, ముందస్తు రోగ నిర్ధారణ, కచ్చితమైన చికిత్స విధానాలతో దానిపై విజయం సాధించే ఉదంతాలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. బ్లడ్‌ క్యాన్సర్‌ చికిత్సలో అధునాతన, ఆశాజనకమైన చికిత్స కార్‌-టీ సెల్‌ థెరపీ అని, ఇది రోగి రోగనిరోధక కణాలను పునరుత్పత్తి చేస్తుందని వివరించారు.

Updated Date - Feb 22 , 2026 | 06:10 AM