Share News

kumaram bheem asifabad- విరగపూసిన మామిడి

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:42 PM

ఈ ఏడాది జిల్లాలో మామిడి పూత విరగ పూసింది. గడిచిన నాలుగేళ్లలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది దాదా పు 25 రోజుల ముందే మామిడి తోటల్లో పూత విరగ బూసింది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా ఉండడం వల్లే పూత వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల్లో పంట దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది. ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే ఈ ప్రభావం కాపుపై పడుతుంది. తెగుళ్లపై అవగాహన పెంచుకుని వాటిని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు పండు తాయి.

kumaram bheem asifabad- విరగపూసిన మామిడి
జగన్నాథ్‌గూడలో మామిడి చెట్టుకు పూత

- దిగుబడిపై రైతులు ఆశలు

జైనూర్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జిల్లాలో మామిడి పూత విరగ పూసింది. గడిచిన నాలుగేళ్లలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది దాదా పు 25 రోజుల ముందే మామిడి తోటల్లో పూత విరగ బూసింది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా ఉండడం వల్లే పూత వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల్లో పంట దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది. ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే ఈ ప్రభావం కాపుపై పడుతుంది. తెగుళ్లపై అవగాహన పెంచుకుని వాటిని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు పండు తాయి. తెగుళ్లు, చీడపీడలను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులతో పూతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మామిడి సాగులో కీలక మైన పూత దశలో సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు అధిక దిగుబడులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. పూత వచ్చే సమయంలో వాతావ రణ పరిస్థితులు అధిక ప్రభావాన్ని చూపుతాయి. ఎంత చలి ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రి పూట 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే మెరుగైన ఫలితాలుంటాయి. పూత దశలో నీటి తడులు నిలిపి వేసి బెట్ట పరిస్థితులు కల్పిస్తే శాకీయ పెరుగుదల నిలిచిపోయి మొక్కకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల చెట్టు పూత సమయానికి సరిపడా పిండి పదార్థం నిల్వ చేసుకోవడమే కాకుండా కొమ్మలు పూర్తి పక్వతకు చేరుకుని ఎక్కువ పూత రావడానికి దోహదపడ తాయి.

- 1,250 ఎకరాల్లో..

జిల్లాలో 1,250 ఎకరాల్లో మామిడి సాగవవుతోంది. దహెగాం, సిర్పూర్‌(టి), కాగజ్‌ నగర్‌, రెబ్బెన, తిర్యా ణి, వాంకిడి, తదితర మండలాల్లో మామడి తోట సాగవవుతోంది. ఇందులో 60 శాతం బంగినపల్లి, మిగిత రకాలు 40 శాతం వరకు ఉంటాయి. ప్రస్తుత పూత పరిస్థితిని బట్టి చూస్తే ఎకరాకు 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది అకాల వర్షాలతో ఆశించిన మేర దిగుబడులు రాలేదు. మామిడి రైతులుతగిన జాగ్రత్తలు పాటిస్తే... లాభాలు తెచ్చి పెడుతుంది. ఇక నుండి ఎండలు పెరిగే ఆవకాశం ఉంటుంది కనుక ఇప్పటి నుండే చెట్లకు నీళ్లు పెట్టాలి. నీళ్లు ఆలస్యంగా పెట్టడంతో పిందేలకు త్వరగా పట్టదు అని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నదీం తెలిపారు పదేళ్లు దాటిన చెట్టుకు 4 నుంచి 6 డ్రిప్‌ల ద్వార రోజుకు రెండు గంటలు నీటిని అందించాల న్నారు. ఒక వేళ మామిడికి బూడిద రోగం వస్తే హెక్సా కొనజోల్‌ మిల్లీలీటరు, లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు.. పిందేలు రాలకుం డా ఉండేందుకు ప్లానోఫిక్స్‌ 0.25 మిల్లీలీటరును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు.

- తెగుళ్లను గుర్తించి నివారించాలి..

ప్రస్తుతం మామిడి తోటల్లో తేనెమంచు తెగులు, తామర తెగులు, బూడిద తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంది. వీటితో పాటు ఆకుమచ్చ, పూత మాడు, నల్లమచ్చ తెగుళ్లు కూడా మామిడి చెట్లపై దాడి చేస్తాయి. ఈ తెగుళ్ల వల్ల దిగుబడిపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు సోకిన ఆకుల మీద ముందుగా గోధుమ రంగు మచ్చలు ఏర్ప డుతాయి. ఆ తర్వాత ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. లేత రెమ్మలపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. పూల గుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతా యి. నిపుణులను సంప్రదించి తగిన మందులు వాడాలి. సస్యరక్షణ చర్యలు చేపడుతూనే ఎండలు ముదురుతున్న కొద్ది క్రమం తప్పకుండా నీటి తడులు ఇస్తే మామిడిలో పూత, పిందె రాలకుండా ఉంటుంది. రైతులు అధికారుల సూచనలు పాటిస్తే మేలు.

Updated Date - Feb 08 , 2026 | 11:42 PM