Share News

kumaram bheem asifabad- సమాచార హక్కు చట్టం సామాన్యుడి హక్కు

ABN , Publish Date - Jan 21 , 2026 | 10:23 PM

సమాచార హక్కు చట్టం సామాన్యుడి హక్కు అని ఆర్డీవో లోకేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో బుధవారం ఎన్‌ఐసీ కాన్ఫరెన్స్‌ హాలలో అన్ని శాఖల పౌర సంబందాల అదికారులు, సహాయ పౌర సంబంధాల అధికారులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

kumaram bheem asifabad- సమాచార హక్కు చట్టం సామాన్యుడి హక్కు
మాట్లాడుతున్న ఆర్డీవో లోకేశ్వరరావు

ఆసిఫాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం సామాన్యుడి హక్కు అని ఆర్డీవో లోకేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో బుధవారం ఎన్‌ఐసీ కాన్ఫరెన్స్‌ హాలలో అన్ని శాఖల పౌర సంబందాల అదికారులు, సహాయ పౌర సంబంధాల అధికారులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టంపై పౌర సంబంధాల అదికారులు, సహయ పౌర సంబంధాల అధికారులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పౌర సంబంధాల అధికారులు, సహాయ పౌర సంబంధాల అధికారులు సమాచార హక్కు చట్టం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టం ద్వారా అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. సమగ్ర విధి నిర్వహణ, అవినీతి నియంత్రణ సమాచార హక్కు చట్టం ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు. అర్జీదారుడు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందించాలని, సమాచార హక్కు చట్టం సామాన్యుడి హక్కు అని తెలిపారు. కార్యక్రమంలో శిక్షకులు కిషన్‌ కలెక్టరేట్‌ ఏవో కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 10:23 PM