Share News

kumaram bheem asifabad- అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం

ABN , Publish Date - Jun 16 , 2026 | 10:57 PM

రాష్ట్రంలో విద్యాహ క్కు చట్టం అమలు కాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా పిల్లలకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (1వ తరగతి నుంచి ఎనిమిది తరగతులు)ను ఉచితంగా అభ్యసించే హక్కును కల్పించింది.

kumaram bheem asifabad- అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం
లోగో

- పట్టించుకోని ప్రభుత్వం

కౌటాల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యాహ క్కు చట్టం అమలు కాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా పిల్లలకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (1వ తరగతి నుంచి ఎనిమిది తరగతులు)ను ఉచితంగా అభ్యసించే హక్కును కల్పించింది. ఏదేని కారణం చేత ఎలిమెంటరీ విద్యను అభ్యసించకుంటే ఎలాంటి ప్రాథమిక విద్య చదవాల్సిన అవసరం లేకుండానే విద్యార్థి నేరుగా తన వయస్సుకు సరిపడా తరగతిలో చేరే అవకాశం ఉంది.

- ఎలిమెంటరీ స్థాయిలో..

ఎలిమెంటరీ స్థాయిలో పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అమలు చేసేందుకు గాను 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యా హక్కు చట్టం-2009ని రూపొందించింది. ఇందులో భాగంగా ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులకు తప్పనిసరిగా విద్యాహక్కు చట్టం అమలు చేయాల్సి ఉంది. అయితే తెలంగాణలో ఈ చట్టం అమలుకు నోచుకోకపోవడంతోపాటు ఆదిలోనే చట్టం నిర్వీ ర్యం అయింది. ప్రభుత్వాల వైఖరి కారణం గా ప్రత్యేక అర్హతలుగల విద్యార్థులకు తీర ని అన్యాయం జరుగుతోంది. గత బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం హయాం నుంచే చట్టాన్ని విస్మరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏ పాఠ శాలలోనూ అది అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, ప్రత్యేక పాఠశాలలు 25 శాతం రిజ ర్వేషన్‌ అమలు చేయాల్సి ఉంది. చట్టం ప్రకారం అనాఽథలు, అంగవైకల్యం గల పిల్లలు, హెచ్‌ఐవీ సోకిన పిల్లలకు పాఠశా లలోని విద్యార్థుల సంఖ్యలో 25 శాతం ఉచిత విద్యను అందించాల్సి ఉం డగా, షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ)కు 10శాతం, షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు నాలుగు శాతం, బలహీనవర్గాలు (బీసీ)కు ఐదు శాతం, మైనారిటీలకు- ఆరు శాతం ఉచితంగా విద్యను బోధించాల్సి ఉంది.

- ప్రత్యేక అర్హతలు గల..

విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రత్యేక అర్హతలు గల విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేసే విద్యా సంస్థలు ససేమిరా అంటున్నాయి. బడ్జెట్‌ పాఠ శాలలను మినహాయిస్తే ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న కార్పొరేట్‌, ఇతర ప్రైవేటు విద్యాసంస్థలు చట్టాన్ని తుంగలో తొక్కడమేగాకుండా, ప్రశ్నించిన వారికి అడ్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. ఆయా పాఠశాలల్లో ఎక్కడ కూడా విద్యా హక్కు చట్టం అమలు కావడం లేదు. విద్యార్థి సంఘాల నాయకులు.. ప్రైవేటు బడుల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విషయమై ధృష్టిసారించాలని కోరుతు న్నా పట్టింపు లేకుండా పోయింది. దీంతో చట్టం నిర్వీర్య మయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటు విద్యార్ధి శరీర బరువులో కేవలం 10 శాతం మాత్రమే పాఠ్య పుస్తకాలు ఉండేలా ఆ చట్టం చెబుతోంది. విద్యార్ధి సుమారు 14 కిలోల ఉండానుకుంటే ఆ విద్యార్థి తీసుకెళ్లే బ్యాగు మాత్రం 4 కిలోలు ఉంటుంది. దాన్ని మోసేందుకు విద్యార్ధి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. ప్రయివేటు పాఠశాలలు నాలుగైదు అంతస్తుల్లో ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు పుస్తకాల బ్యాగులు అన్నీ అంతస్తులు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభ మయ్యాయి. విద్యా సంవత్స రం ఆరంభం నుంచే విద్యాహక్కు చట్టం అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడితే ప్రత్యేక అర్హతలు గల విద్యార్థులకు మేలు చేకూర్చినట్లు అవుతుంది.

Updated Date - Jun 16 , 2026 | 10:57 PM