రైట్.. రైట్..
ABN , Publish Date - Apr 26 , 2026 | 10:48 PM
మహిళా స్వయం సహా యక సంఘాల ద్వారా కొనుగోలు చేసిన అద్దె బస్సులు ఆర్టీసీ డి పోలకు చేరుకున్నాయి. మంచిర్యాల జిల్లాలోని 16 మండల స మాఖ్యలకు ఒక్కొక్కటి చొప్పున బస్సులు కేటాయించారు.
-ఆర్టీసీకి మహిళా సంఘాల అద్దె బస్సులు
-16 మండల సమాఖ్యలకు కేటాయింపు
-వారం రోజుల్లో అందుబాటులోకి
నెన్నెల, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : మహిళా స్వయం సహా యక సంఘాల ద్వారా కొనుగోలు చేసిన అద్దె బస్సులు ఆర్టీసీ డి పోలకు చేరుకున్నాయి. మంచిర్యాల జిల్లాలోని 16 మండల స మాఖ్యలకు ఒక్కొక్కటి చొప్పున బస్సులు కేటాయించారు. జిల్లాకు వచ్చిన బస్సులను ఇప్పటికీ మంథని డిపోకు 9, సిరిసిల్ల, మంచి ర్యాల డిపోలకు ఒక్కో బస్సును అద్దెకు ఇచ్చారు. బస్సుల రిజిస్ట్రేష న్ పూర్తి చేసుకొని ఆయా మండల సమాఖ్యల అధ్యక్షులు ఆర్టీసీతో హైపోథికేషన్ చేసుకున్నారు. మరో వారం రోజుల్లో ఈ బస్సులు రొడ్డెక్కనున్నాయి. ఈ బస్సుల రాకతో ఆర్టీసీకు బస్సుల కొరత తీ రడంతో పాటు వచ్చే అద్దె డబ్బులతో మహిళా సంఘాలు ఆర్థి కంగా బలపడనున్నాయి.
-ఒక్కో బస్సుకు రూ. 36 లక్షలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళాశక్తి పథకాన్ని తీసుకువ చ్చింది. అందులో భాగంగానే ఆర్టీసీ అద్దెబస్సులను ఇవ్వాలని సం కల్పించారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆ ర్టీసీకి అద్దెకు ఇస్తున్నారు. ఒక్కో బస్సును రూ. 36 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. రూ. 30 లక్షలను నేషనల్ రూరల్ లైవ్‌లీహుడ్ మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా సెర్ప్ సమకూర్చింది. ఇక మిగి లిన రూ. 6 లక్షలు మండల సమాఖ్య నిధుల నుంచి వెచ్చిం చారు. ఈ మేరకు 16 బస్సులకు మండల సమాఖ్యల పేరిట 5.76 కోట్లు ఆర్టీసీకి చెల్లించారు. ఈ నిధులతో సంస్థ బస్సులను కొనుగో లు చేసింది. భీమిని, కాసిపేట, బెల్లంపల్లి, కన్నెపల్లి, హాజీపూర్, దండెపల్లి, జైపూర్, కోటపల్లి, భీమారం, చెన్నూరు, జన్నారం మం డల సమాఖ్యలకు బస్సులు వచ్చాయి.
తీరనున్న బస్సుల కొరత..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారరంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో బస్సు ల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అదనపు బస్సుల అవసరం ఏర్పడింది. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి అద్దె బస్సులు తీ సుకునే బదులు మహిళా సంఘాలకే బస్సులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు స మకూరుతుండటంతో ఆర్టీసీలో కొంత వరకుబస్సుల కొరత తీర నుంది. కొత్త బస్సుల రాకతో ప్రయాణీకులకు సైతం సౌకర్యం కల గనుంది. జిల్లాకు సమీపంలోని డిపోల్లో పల్లెవెలుగు బస్సుల అవ సరం ఎక్కువగా ఎక్కడ ఉంటే ఆ డిపోలకు ప్రాధాన్యత క్రమంలో బస్సులను కేటాయిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఈ బస్సులను నడిపించనున్నారు.
రూ. 22 లక్షల లాభం..
బస్సు కొనుగోలుకు అయ్యే నిధులను ఈఎంఐ రూపంలో ఏడేళ్ల పాటు ఆర్టీసీనే చెల్లిస్తుంది. బస్సు డ్రైవర్, కండక్టర్, డీజిల్, మిగతా మెయింటనెన్స్ మొత్తం ఆర్టీసీనే చూసుకుంటుంది. ప్రతీ మూడో వారంలో రూ.69,468ల చొప్పున 84 నెలలు చెల్లించేందుకు ఆర్టీసీ అంగీకారం తెలిపింది. ప్రతీ నెల 21 నుంచి 25 తేదీల మధ్యలో చెల్లించే ఈ మొత్తం సెర్ప్ కమ్యూనిటీ ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్ కింద మండల సమాఖ్య ఖాతాలో జమ అవుతుంది. ఏడేళ్లలో బస్సు అ ప్పు మొత్తం తీరిపోవడంతో పాటు సంబందిత మండల సమా ఖ్యకు రూ.22.35 లక్షల వరకు లాభం చేకూరుతుంది. ఈ మొత్తా న్ని మహిళా సంఘాల్లోని సభ్యుల అభ్యున్నతికి వినియోగిస్తారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
ఎస్. కిషన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి
స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చే యడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పారిశ్రామిక వేత్తలతో పోటీపాడే స్థాయికి గ్రామీణ మహిళలు ఎదిగేలా ప్రభుత్వం వివి ధ కార్యక్రమాలు చేపడుతోంది. మండల సమాఖ్యల ద్వారా బస్సు ల కొనుగోలుతో మహిళలే ఓనర్లలయ్యారు. జిల్లాలోని 16 మండల సమాఖ్యల ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇ చ్చాం. ఈ పాటికే 11 బస్సులకు సంబదిత ఒప్పందాలు పూర్తి అ య్యాయి. మంచిర్యాల జిల్లా బస్సులు మంథని డిపోకు 9, సిరిసి ల్ల, మంచిర్యాల డిపోలకు ఒక్కొ బస్సులను కేటాయించారు. బస్సు ల అద్దెతో వచ్చే ఆదాయంతో సంఘాలు బలోపేతం కావడంతో పాటు ఆర్టీసీకి ప్రయోజనం చేకూరుతుంది.