kumaram bheem asifabad- ఎస్పీఎం కార్మిక జేఏసీలో విభేదాలు
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:27 PM
సిర్పూరు పేపర్ మిల్లులో కార్మిక సమస్యల పరిష్కారం కోసం నాలుగు నెలల క్రితం ఐక్యంగా ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)లో ఇప్పుడు విభేదాలు బయట పడ్డాయి. మొదట ఐక్యంగా కన్పించిన ఈ వేదికలో ఇప్పుడు తీవ్ర విభేదాలు బయట పడి రెండుగా చీలిపోయాయి. మొత్తం 16 కార్మిక సంఘాల కలిసి జేఏసీగా ఏర్పడి గుర్తింపు సంఘం ఎన్నికలే ప్రధాన డిమాండుతో ఉద్యమాన్ని ప్రారంభించాయి.
- రెండుగా చీలిన కార్మిక సంఘాలు
కాగజ్‌నగర్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు పేపర్ మిల్లులో కార్మిక సమస్యల పరిష్కారం కోసం నాలుగు నెలల క్రితం ఐక్యంగా ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)లో ఇప్పుడు విభేదాలు బయట పడ్డాయి. మొదట ఐక్యంగా కన్పించిన ఈ వేదికలో ఇప్పుడు తీవ్ర విభేదాలు బయట పడి రెండుగా చీలిపోయాయి. మొత్తం 16 కార్మిక సంఘాల కలిసి జేఏసీగా ఏర్పడి గుర్తింపు సంఘం ఎన్నికలే ప్రధాన డిమాండుతో ఉద్యమాన్ని ప్రారంభించాయి. కానీ అదే ఏడు సంఘాల్లో ఇప్పుడు విభేదా లు చెలరేగి పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. నాలుగు నెలలుగా జేఏసీ నాయ కులు దశల వారిగా ఆందోళనలు నిర్వహిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను కలవటం, వినతి పత్రాలు ఇవ్వడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం చేశారు. స్పందన లేక పోవడంతో మిల్లు గేటు ఎదుట నిరవధిక దీక్షలు ప్రారంభించారు. ఈ ఉద్యమానికి సిర్పూరు ఎమ్మెల్యే, ఇతర నాయకులు మద్దతు పలికి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. కానీ నాయ కుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడి ఐక్యత ఒక్కసారి కూలిపోయింది.
- ఇటవల కాలంలో..
ఇటీవల బీఎంఎస్ ఆధ్వర్యంలో ఎస్పీఎం కార్మిక సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో కార్యక్ర మాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. మరో సంఘం నాయకులు కార్మికుల మధ్య ఐక్య తను దెబ్బతీయరాదని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుతో పాటు సంఘాల నాయకులను కలిసి భవిష్యతులో తలెత్తే వివిధ సమస్యలపై వివరించారు. కార్మిక సంఘాల నాయకుల మాటలను పక్కన పెట్టి ఏకంగా బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమ వేదిక ఏర్పాటు చేసిన సమస్యలపై చర్చించడంతో కొత్త కుంపటి ఏర్పడి కార్మిక జేఏసీలో రెండుగా చీలినట్లయింది. ఈ సమావేశానికి కూడా సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌ను ఆహ్వానించారు. వీరు హాజరు కావడంతో ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. జేఏసీ చీలికతో కార్మికుల్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పాత జేఏసీ నాయకులు మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేంత వరకు పోరాటం ఆపేది లేదని స్పష్ట చేస్తున్నారు. ఎన్నికలే శాశ్వత పరిష్కారమని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన సంఘం నాయకులు మాత్రం ఎన్నికల ప్రక్రి యకు సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణ ఉపశమనంగా వేతన ఒప్పందం సాధించడమే లక్ష్యమని చెబుతున్నారు. వేతన ఒప్పందం జరిగితే యాజమాన్యం ఎన్నికల అంశాన్ని పక్కన పెట్టే ప్రమాదం ఉందని పాత వర్గం నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాతవర్గం నాయకులు భవిష్యత్తు కార్యాచరణ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. శుక్రవారం సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. జేఏసీ చీలికతో ముమ్మాటికీ ఎస్పీఎం యాజమా న్యానికే ప్రయోజనమని కార్మికులు చర్చించుకుంటున్నారు.