Share News

kumaram bheem asifabad- వేలి ముద్ర వేస్తేనే బియ్యం

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:18 PM

ప్రజా పంపిణీ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత ఆహార భధ్రత కార్డుల ఈకేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) పౌర సరఫరాల శాఖ తప్పని సరి చేసింది. వేలి ముద్ర వేసి ఈ కేవైసీ చేస్తేనే రేషన్‌ బియ్యం అందే వీలుంది. దీని గడువు ఈ నెల 31 వరకు తుది గడువుగా నిర్ణయించారు. ఈ నమోదు అయిన వారికి వచ్చే నెల నుంచి సరుకులు సరఫరా అయ్యేలా ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తోంది.

kumaram bheem asifabad- వేలి ముద్ర వేస్తేనే బియ్యం
లోగో

- అవగాహన కల్పిస్తున్న అధికారులు

- రేషన్‌ కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యుల వేలిముద్రల సేకరణ

చింతలమానేపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత ఆహార భధ్రత కార్డుల ఈకేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) పౌర సరఫరాల శాఖ తప్పని సరి చేసింది. వేలి ముద్ర వేసి ఈ కేవైసీ చేస్తేనే రేషన్‌ బియ్యం అందే వీలుంది. దీని గడువు ఈ నెల 31 వరకు తుది గడువుగా నిర్ణయించారు. ఈ నమోదు అయిన వారికి వచ్చే నెల నుంచి సరుకులు సరఫరా అయ్యేలా ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తోంది. గ్రామాల్లో మృతి చెందిన వారు, ఏళ్లుగా రేషన్‌ తీసుకొని వారి కార్డులను తొలగించి నిజమైన అర్హులకు రేషన్‌ కార్డులను అందించాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈ కేవైసీ కోసం అర్హులందరు కేవైసీ కోసం రేషన్‌ షాపుల వద్దకు వస్తున్నారు.

- వేలి ముద్రలు పడక..

వేలి ముద్రలు పడక రేషన్‌ దుకాణాల్లో అవస్థలు పడుతున్నారు. వృద్ధుల వేలి ముద్ర పడక పోవడం, పదేళ్ల లోపు చిన్నారుల ఆధార్‌ అనుసంధానం కాక పోవడం, ఆధార్‌లో తప్పులు తదితర సమస్యల కార ణంగా నమోదు ప్రక్రియ నత్త నడక సాగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో సాంకేతిక సమస్యలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రేషన్‌ కార్డు దుకాణాలకు వెళ్లి ఆధార్‌ కార్డు నమోదు చేస్తే అది ఓపెన్‌ కావడం లేదని ఈ కేవైసీకి వచ్చిన వారు నిరాశాతో వెళుతున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలకు కేవైసీ చేయటానికి వస్తే రావటం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. అలా అయితే రేషన్‌ పోతోందా.. ఉంటుందా.. అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- ఏ దుకాణం నుంచి..

కేంద్రం ప్రవేశపెట్టిన రేషన్‌ పోర్టబులిటి సౌకర్యం ద్వారా దేశంలోని ఏ దుకాణం నుంచి అయిన సరుకులను తీసుకోవచ్చు. అదే విధానంలో కూడా ఈకేవైసీ అప్‌డేట్‌ కోసం లబ్ధిదారులు తమ పరిఽధిలోని రేషన్‌ దుకాణం నుంచే కాకుండా దేశం లో ఎక్కడైనా అప్‌డేట్‌ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు ఈ కేవైసీ కోసం సొంతూర్లకు వెళ్లాల్సిన పని లేదు. ప్రస్తుతం ఉంటున్న ప్రాంతానికి దగ్గరల్లోని ఏ షాపు నుంచి అయిన రేషన్‌, ఆధార్‌ కార్డు వివరాలు సమర్పించి చేసుకోవచ్చు.

- కార్డుల్లో పేర్లు ఉన్నంత వారంతా..

ప్రతి నెల రేషన్‌ తీసుకునేందుకు కార్డుల్లోని ఎవ రో ఒకరు వెళ్లి వేలి ముద్ర వేస్తే సరుకులను అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేవైసీ కోసం కార్డుల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం రేషన్‌ కార్డులు 1,65,258 కార్డులు ఉండగా, లబ్ధిదారులు మాత్రం 5,43,818 మంది ఉన్నారు. 280 రేషన్‌ దుకాణాలుండగా, ఇప్పటికే 80 శాతం పూర్తి అయిం ది. మరో 20 శాతం ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది.

ప్రతీ ఒక్కరు ఈకేవైసీ చేసుకోవాలి..

- ప్రకాష్‌, చింతలమానేపల్లి తహసీల్దార్‌

రేషన్‌ కార్డులో పేరు ఉన్న ప్రతీ ఒక్కరు ఈ కేవైసీ చేసుకోవాలి. ఈ ప్రక్రియతో పారదర్శకత ఉంటుంది. అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్‌ కార్డు ద్వా రా బియ్యం అందుతాయి. బోగస్‌ కార్డుల ఏరివేతకు మార్గం క్లియరెన్స్‌ ఉంటుంది. ఈ నెల 31వ తేదీ లోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవల్సి ఉంటుంది.

Updated Date - Jul 25 , 2026 | 11:18 PM