రేషన్ షాపులకు చేరని బియ్యం
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:13 PM
లబ్ధి దారులకు రేషన్ సరుకులు పంపణీ చేసే చౌక ధరల దుకాణాలు స్టాక్ లేక వెలవెలబోతున్నా యి. ప్రతీ నెల ఒకటి నుంచి 15వ తేదీలోపు రే షన్ షాపుల్లో బియ్యం పోయాల్సి ఉంది.
-ఖాళీగా దర్శనమిస్తున్న చౌక ధరల దుకాణాలు
-నేటి నుంచి పంపిణీ జరగాల్సి ఉన్నా అందని స్టాక్
-ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి లేకపోవడంతో ఆగిన సరఫరా
మంచిర్యాల, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): లబ్ధి దారులకు రేషన్ సరుకులు పంపణీ చేసే చౌక ధరల దుకాణాలు స్టాక్ లేక వెలవెలబోతున్నా యి. ప్రతీ నెల ఒకటి నుంచి 15వ తేదీలోపు రే షన్ షాపుల్లో బియ్యం పోయాల్సి ఉంది. ఈ లోగానే అంటే కిందటి నెల 25వ తేదీ వరకు బియ్యం రేషన్ షాపులకు చేరాలి. కానీ 30వ తే దీ ముగిసినా ఎంఎల్‌ఎస్ (మండల్ లెవెల్ స్టా కిస్ట్ పాయింట్) పాయింట్ల నుంచి బియ్యం షా పులకు సరఫరా కాలేదు. దీంతో ఒకటవ తేదీన లబ్దిదారులకు పంపిణీ చేసే పరిస్థితులు లేవు. ముఖ్యంగా మంచిర్యాల, చెన్నూరు ఎం ఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలో బియ్యం సరఫరా జరుగక పోవడంతో లబ్ధిదారులకు ఎదురు చూపులు త ప్పేలా లేవు. జిల్లాలో మొత్తం ఐదు ఎంఎల్ ఎస్ గోదాముల ద్వారా 423 చౌక ధరల దుకా ణాలకు బియ్యం సరఫరా కావాల్సి ఉంది.
ఖాళీగా దర్శనమిస్తున్న షాపులు...
ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం సర ఫరా కాకపోవడంతో చౌక ధరల దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేసవి కాలంలో తీ వ్ర ఎండల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశా లతో ఏప్రిల్, మే, జూన్ నెలలకు చెందిన రేషన్ బియ్యాన్ని లబ్దిదారులకు ఒకేసారి పంపిణీ చే శారు. దీంతో ప్రతినెలా ఎండలో బియ్యం తీసు కునే బాధలు తప్పినట్లయింది. మూడు నెలల గడువు జూన్‌తో ముగియగా, జూలై నుంచి ప్ర తినెలా బియ్యం పంపిణీ జరగాల్సి ఉంది. ఇం దు కోసం ముందుగానే పౌరసరఫరాల శాఖ ఏ ర్పాట్లు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రేషన్ షాపుల్లో పా త కథే పునరావృతం కానుంది. జిల్లాలోని లబ్ధి దారులకు పంపిణీ చేసేందుకు సరిపడా బి య్యం వారం రోజులు ముందుగానే షాపుల్లో అందుబాటులో ఉంచాలి. స్టాక్ వివరాల సరి చూసుకొని డీలర్లు ఒకటవ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేస్తారు. అయితే బియ్యం పంపిణీ సమయం వచ్చినా బియ్యం అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. ఈ కారణంగా ఒకటవ తేదీ నుంచి లబ్దిదారులు రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
170 షాపుల్లో నో స్టాక్....
జిల్లాలోని 423 షాపులకు లబ్ధిదారుల సం ఖ్యను బట్టి సగటున ప్రతి నెల 80 క్వింటాళ్ల మేర బియ్యం అవసరం అవుతాయి. అయితే ఇ ప్పటి వరకు మంచిర్యాల, చెన్నూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలో ఉన్న చౌక ధరల దుకా ణాలకు బియ్యం పూర్తిస్థాయిలో చేరలేదు. మం చిర్యాల ఎంఎల్‌ఎస్ పాయింట్ సీసీసీ నస్పూ ర్‌లో ఉండగా, దాని పరిధిలోని 142 షాపులకు జూలై కోటా పంపిణీ జరగలేదు. మంచిర్యాల ఎంఎల్‌ఎస్ పాయింట్ పరిధిలో సుమారు 1200 క్వింటాళ్ల బియ్యం సరఫరా కావల్సి ఉంది. అలాగే చెన్నూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ పరి ధిలో 52 రేషన్ షాపులు ఉండగా, ఇక్కడ 15 షాపులకు బియ్యం సరఫరా జరిగింది. మిగతా షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చెన్నూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ పరిధిలో సుమారు 2500 క్వింటాళ్ల బియ్యం సరఫరా కావలసి ఉం ది. స్టాక్ కోసం డీలర్లు పడిగాపులు కాస్తున్నా సరఫరా కావడం లేదు. దీంతో లబ్ధిదారులకు జవాబు చెప్పలేక డీలర్లు షాపులను మూసి ఉంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
తరుచుగా ఇదే తంతు...
గత కొంతకాలంగా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సకాలంలో బియ్యం అందడం లే దు. వేసవి కాలంలో ఏప్రిల్ నుంచి జూన్ వర కు ఒకేసారి బియ్యం పంపిణీ చేసినందున ఎ లాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ప్రస్తుతం ఏ నెల కోటాను అదే నెల ఇవ్వాల్సి రావడంతో మ ళ్లీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతకు ముందు మార్చి నెలలోనూ ఇదే పరిస్థితి నెల కొంది. ప్రతీ నెల ఏదో కారణం చూపి లబ్ధిదా రులను షాపుల చుట్టూ తిప్పుకోవడం ఆనవా యితీగా మారింది. సంబంధిత అధికారుల నిర్ల క్ష్యం కారణంగా బియ్యం ఎప్పుడు పంపిణీ చే స్తారో తెలియని పరిస్థితులు నెలకొంది.
గడువు పెంచుతారా...?
రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ ఒకటవ తేదీ నుంచి 15 వరకు జరగా ల్సి ఉంది. రేషన్ షాపులకు సరుకు సర ఫరా కానందున లబ్దిదారులకు పంపిణీ చేయడంలో ఆలస్యం జరుగనుంది. పంపిణీ గడువు కుదించడంతో రేషన్ కోసం షాపుల వద్ద లబ్దిదారులు బారు లు తీరే అవకాశాలు ఉన్నాయి. ఈ ప రిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారు లు పంపిణీ గడువు పెంచాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.