జాతీయ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి జోరు
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:43 AM
సీఎం రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతోంది. రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ...
పలు రాష్ట్రాల స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక
న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతోంది. రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) ఆయనను కీలక బాధ్యతలతో రంగంలోకి దించుతోంది. కేరళ, అసోం, గోవా రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా ఏఐసీసీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి దిగ్గజ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాల్లో ప్రచార పర్వంలో పాల్గొనబోతున్నారు. పుదుచ్చేరి స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లకు కూడా చోటు దక్కింది.