వచ్చే సమావేశాలకల్లా అసెంబ్లీ సెంట్రల్ హాల్ సిద్ధమవ్వాలి: సీఎం
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:05 AM
వచ్చే సమావేశాల నాటికి అసెంబ్లీ సెంట్రల్ హాల్ సిద్ధం కావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో...
ఫ్యూచర్‌సిటీలో మెడికల్ సిటీ
మెడికల్ టూరిజంలో పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తున్నాం
అపోలో కొత్త ఆస్పత్రి ప్రారంభోత్సవంలో రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే సమావేశాల నాటికి అసెంబ్లీ సెంట్రల్ హాల్ సిద్ధం కావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సీఎం సమీక్ష నిర్వహించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ, మండలి కార్యదర్శులు, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. శాసనసభ, మండలి సభల గౌరవం పెరిగేలా, సభ్యులకు మరింత ప్రైవసీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం పబ్లిక్ గార్డెన్స్‌లో క్లబ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ క్రమంలో హెరిటేజ్ భవనాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యుల కోసం వాకింగ్ ట్రాక్, క్రీడా సదుపాయాలను కల్పించాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణం భద్రతను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు.