Share News

కేరళంకు సీఎం రేవంత్‌

ABN , Publish Date - May 18 , 2026 | 02:51 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళం పర్యటనకు వెళ్లారు. సోమవారం ఆ రాష్ట్ర సీఎంగా వీడీ సతీశన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో...

కేరళంకు సీఎం రేవంత్‌

  • నేడు ఆ రాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళం పర్యటనకు వెళ్లారు. సోమవారం ఆ రాష్ట్ర సీఎంగా వీడీ సతీశన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారమే బయలుదేరి వెళ్లారు. ఇటు.. రాష్ట్రంలో మే 21 నుంచి జూన్‌ 1 వరకు జరిగే సరస్వతీ అంత్యపుష్కరాలకు హాజరుకావాలని, మే 23న యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాలతో పాటు దేవస్థానానికి సంబంధించిన ఇతర పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు రావాలని కోరుతూ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. రేవంత్‌రెడ్డికి ఆహ్వానపత్రికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 02:51 AM