Share News

సీఎం రేవంత్‌తో కర్ణాటక బయో ఎనర్జీ బోర్డు చైర్మన్‌ చర్చలు..

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:45 AM

సీఎం రేవంత్‌ రెడ్డితో కర్ణాటక రాష్ట్ర బయో ఎనర్జీ డెవల్‌పమెంట్‌ బోర్డు చైర్మన్‌ ఎస్‌ఈ సుధీంద్ర పలు అంశాలపై చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ..

సీఎం రేవంత్‌తో కర్ణాటక బయో ఎనర్జీ బోర్డు చైర్మన్‌ చర్చలు..

బెంగళూరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డితో కర్ణాటక రాష్ట్ర బయో ఎనర్జీ డెవల్‌పమెంట్‌ బోర్డు చైర్మన్‌ ఎస్‌ఈ సుధీంద్ర పలు అంశాలపై చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో రేవంత్‌ ప్రయాణిస్తున్న విమానం శుక్రవారం రాత్రి బెంగళూరులో ల్యాండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రాత్రి బెంగళూరులోనే బస చేశారు. విషయం తెలుసుకున్న సుధీంద్ర.. ఎయిర్‌పోర్ట్‌లో సీఎంను కలిశారు. కర్ణాటక బయో ఎనర్జీ విధానాల గురించి శనివారం ఉదయం ఆయనకు వివరించారు. తెలంగాణలో బయో ఎనర్జీపై పెట్టుబడులు పెట్టాలని, ఉత్పాదనా విభాగాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సుధీంద్ర తెలియజేశారు. భేటీ అనంతరం సీఎం రేవంత్‌ హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో బయల్దేరారు.

Updated Date - Jun 14 , 2026 | 04:45 AM