రాష్ట్రానికి శాశ్వత సీఎంలా వ్యవహరిస్తున్న రేవంత్
ABN , Publish Date - Aug 16 , 2026 | 10:55 PM
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి శాశ్వత సీఎంలాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి శాశ్వత సీఎంలాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వ ము ద్ర, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశ ప్రజలు ఆకలితో అలమటించకూడదని ప్రజలందరికి ఉచితంగా 5 కేజీల రేషన్ బియ్యం కేంద్రం అందిస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుని శాశ్వత రాజులాగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులపై ముఖ్యమంత్రుల ఫొటోలు పెట్టకుండా కేవలం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారిక ముద్రలు ఉంటే మన రాష్ట్రంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ ముద్ర, ప్రధాని మోదీ ఫొటో లేకుండా రేషన్ కా ర్డులు పంపిణీ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పదవులు శాశ్వతం కాదని, కానీ పేదలకు అందించే రేషన్ కార్డులు శాశ్వ తం అని, వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార ముద్రలతో రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్నారు. విద్యార్థుల ఫీజురీయింబర్స్ యమెంట్ ను కేవలం ఈ సంవత్సరం విద్యార్థులకు చెల్లిస్తామని పేర్కొనడం సరైంది కాదని, పెండింగ్‌లో ఉన్న బిల్లుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఫీజురీ యింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి కళాశాలలు నిరాకరిస్తున్నాయని, దీంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. పెండింగ్‌లో బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సమావేశం లో జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు ముకేష్‌గౌడ్, అశోక్, పురుషోత్తం, సత్యనారాయణ, రాము, వెంకటేశ్వర్‌రావు, కృష్ణమూర్తి, ఆంజనేయులు, రాజ్‌కుమార్, సతీష్‌రావు పాల్గొన్నారు. 49డిపిఎల్16: రెబ్బనపల్లిలో ఇంటిగ్రేటెడ్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
జిల్లా అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో చంద్రయ్య
దండేపల్లి ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే ప్రాం గణంలో నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తోందని జిల్లా అదనపు కలె క్టర్ చంద్రయ్య అన్నారు. ఆదివారం దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామ శి వారులో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల నిర్మాణ పనులను ఆయన సంద ర్శించారు. ఆయన మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో టె క్నాలజికి అనుగుణంగా అన్ని హంగులతో కార్పొరేట్ స్థాయి విద్యాభోధన ఉం టుందన్నారు. ఈపాఠశాలోని 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అన్నికులమతాల విద్యార్థులు చదువుకునే సౌకర్యం ఉం టుందన్నారు. ఆధునిక తగరతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, క్యాం టిన్ సౌకర్యం, వసతిగృహాలు అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం పా ఠశాల నిర్మాణ పురోగతిని, పనుల నాణ్యతను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు సూచనలు సలహాలు అందిం చారు. పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే విద్య సంవ త్సరం నాటిని స్కూల్ సంబంధించిన భవనాలను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు కందుల కల్యాణి-అశోక్, ఎంఈవో మంత్రి రాజు, ఎంపీవో విజయప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి, ఉప సర్పంచ్ ఊరటి వినోద్, పంచాయతీ కార్యదర్శి గంగారం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.