Share News

రిటైర్డ్‌ ఐఏఎస్‌పై సీసీఎస్‌లో కేసు

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:26 AM

ఇండోనేషియాలో ఇసుక మైనింగ్‌ చేసి, సింగపూర్‌కు రవాణా చేస్తామని.. ఎన్నారైని మోసగించి రూ.4.50 కోట్లు కాజేసిన మాజీ ఐఏఎస్‌..

రిటైర్డ్‌ ఐఏఎస్‌పై సీసీఎస్‌లో కేసు

  • ఇసుక పేరుతో రూ.4.50 కోట్లు వసూలు..ఎన్నారైకి కుచ్చుటోపీ

  • సీసీఎ్‌సలో బాధితుడి ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఇండోనేషియాలో ఇసుక మైనింగ్‌ చేసి, సింగపూర్‌కు రవాణా చేస్తామని.. ఎన్నారైని మోసగించి రూ.4.50 కోట్లు కాజేసిన మాజీ ఐఏఎస్‌ అధికారిపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ వాసి విక్రమాదిత్య బొప్పూడి అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. భార్య తరపు బంధువుల ద్వారా విక్రమాదిత్యకు ఏపీ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దయాచారి పరిచయమయ్యాడు. విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నామని విక్రమాదిత్యను నమ్మించిన దయాచారి ఇండోనేషియాలో ఇసుక మైనింగ్‌ ప్రాజెక్టుకు అనుమతులతోపాటు సింగపూర్‌కు ఎగుమతి అనుమతులున్నట్లు నకిలీ పత్రాలు చూపాడు. తన సంస్థలో 16ు వాటా ఇస్తామని చెప్పి పలు దఫాలుగా రూ. 4.50 కోట్లు వసూలు చేశాడు. తర్వాత ఒప్పందం మేరకు షేర్లు బదిలీ చేయకుండా కాలయాపన చేయడంతో అనుమానం వచ్చి విక్రమాదిత్య ఆరా తీశాడు. తన వద్ద తీసుకున్న డబ్బు ఇతర సంస్థలకు తరలించారని గుర్తించి దయాచారిని నిలదీశాడు. దాంతో రూ.8 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చిన దయాచారి, తర్వాత పలు కారణాలో ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దాంతో బాధితుడు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - Feb 21 , 2026 | 03:26 AM