Share News

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:10 PM

భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిం చడంతో పాటు భూముల హద్దులను పక్కా గా నిర్ధారించి భూ రికార్డుల్లో పారదర్శకత ల క్ష్యంగా ప్రభుత్వం రీ సర్వే కార్యక్రమాన్ని చే పట్టిందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే
కోనంపేటలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిం చడంతో పాటు భూముల హద్దులను పక్కా గా నిర్ధారించి భూ రికార్డుల్లో పారదర్శకత ల క్ష్యంగా ప్రభుత్వం రీ సర్వే కార్యక్రమాన్ని చే పట్టిందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు మంగళవారం మండలంలోని కోనంపేట గ్రా మంలో ఏర్పాటు చేసిన సమగ్ర భూ సర్వే అ వగాహన సదస్సుకు మండల తహసీల్దార్‌ మ ల్లికార్జున్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ భూ రీసర్వేలో భాగంగా ప్రతి మం డలంలో తొలి విడతగా రెండు గ్రామాలను ఎంపిక చేసి ప్రక్రియ నిర్వహించడం జరు గుతుందన్నారు. పాత భూ రికార్డుల్లోని స మస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటు న్నామన్నారు. భూముల విస్తీర్ణం, హద్దులు, యజమాన్య వివరాలకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. కొన్ని సందర్భాల్లో వాస్తంగా ఉన్న భూమి కంటే రికార్డుల్లో ఎక్కువ విస్తీర్ణం నమోదు కావడం, భూమి ఎక్కువగా ఉన్నప్పటికీ రికార్డుల్లో త క్కువగా నమోదవడం, భూ ఆక్రమణలు, హద్దుల వివాదాలు, గ్రామాల సరిహద్దులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రీ సర్వే ద్వారా భూముల రికా ర్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా మా రుతుందన్నారు. అంతకుముందు మండల కేం ద్రంలో కొనసాగుతున్న వెనకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహ నిర్మాణ పనులను ప రిశీలించి అధికారులకు పలు సూచనలు చేశా రు. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పను లను పరిశీలించి ప్రారంభానికి సిద్ధం చేయా లన్నారు. గోదావరి పుష్కర ఘాట్‌ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌కు సూచించారు. సోమనపల్లిలో చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల పనులను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:10 PM