Share News

గ్యాస్‌సరఫరాపై ఆంక్షలు

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:13 AM

పశ్చి మాసియాలో జరుగుతున్న ప్రభావం వల్ల గల్ఫ్‌దేశాల నుంచి రావాల్సిన గ్యాస్‌ నిలిచిపోవడంతో గ్యాస్‌ నిల్వ లు తగ్గి కొరత ఎదురవుతుంది. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ను నిలిపివేశారు. దీంతో జిల్లాలోని హోటళ్లు, ఇతర కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగదారులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు.

గ్యాస్‌సరఫరాపై ఆంక్షలు

జిల్లాలో ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ నిలిపివేత

విద్యా సంస్థలకు మాత్రమే సరఫరా

చిరు వ్యాపారులు, హోటళ్లపై ప్రభావం

నెలలో ఒకే సిలిండర్‌ బుకింగ్‌కు అవకాశం

గ్యాస్‌ ఎజెన్సీలకు పరుగులు పెడుతున్న వినియోగదారులు

మంచిర్యాలక్రైమ్‌, మార్చి16 (ఆంధ్రజ్యోతి): పశ్చి మాసియాలో జరుగుతున్న ప్రభావం వల్ల గల్ఫ్‌దేశాల నుంచి రావాల్సిన గ్యాస్‌ నిలిచిపోవడంతో గ్యాస్‌ నిల్వ లు తగ్గి కొరత ఎదురవుతుంది. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ను నిలిపివేశారు. దీంతో జిల్లాలోని హోటళ్లు, ఇతర కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగదారులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ ఇవ్వా లని హోటల్‌ యజమానులు మొరపెట్టుకుంటున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 2లక్షల గ్యాస్‌ కనెక్షన్‌లు ఉం డగా కేవలం జిల్లా కేంద్రంలోనే సుమారు 40వేల కనె క్షన్‌లు ఉన్నాయి. వీటిలో కమర్షియల్‌ కనెక్షన్‌లు 500 ఉండడం గమనార్హం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ బీభత్సం నేపథ్యంలో గ్యాస్‌ సరఫరాకు కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పె ట్టుకుని భవిష్యత్‌లో గ్యాస్‌ సరఫరాపై ఎలాంటి ప్రభా వం ఉండకుండ చూసేందుకు జిల్లా యంత్రాంగం చ ర్యలు చేపట్టింది. గ్యాస్‌ పక్క దారి పట్టకుండా ఉం డేందుకు సంబంధిత శాఖ అధికారులు ఏజెన్సీలపై గోదాములపై నిఘాపెట్టారు. గ్యాస్‌ పక్కదారిపట్టకుం డా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. గృహ అవస రాలకు మాత్రమే గ్యాస్‌ను అందించాలని, నెలకు ఒక సిలిండర్‌ మాత్రతే బుకింగ్‌ చేసిన వారికి అందివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతూ గ్యాస్‌కోసం ఏజెన్సీ వద్దకు పరుగులు పెడుతున్నారు. అవసరం లేకున్నా తరువాత దొరుకుతుందో లేదోనన్న భయంతో బుకింగ్‌ చేసుకోవడంతో గ్యాస్‌ కొరత లేనప్పటికీ కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండ గా వరకు యుద్ధం జరుగుతున్నా గ్యాస్‌ కొరత లేదని సరిపడా నిల్వలు ఉన్నాయని, గృహ వినియోగదా రు లు ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు చెబు తున్నప్పటికీ సామాన్య జనం మాత్రం గ్యాస్‌ కోసం టెన్షన్‌ పడుతూనే ఉన్నారు. అయితే అవసరం లేకున్నా ముందస్తు ఉన్నాయని, గృహ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నప్పటికీ సామాన్య జనం మాత్రం గ్యాస్‌ కోసం టెన్షన్‌ పడుతూనే ఉన్నారు. అయితే అవసరం లేకున్నా ముంద స్తు జాగ్రత్త కోసం కొందరు రెండు మూడు గ్యాస్‌ సి లిండర్లను ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నా రు. ఇందులో భాగంగానే నెలలో రెండు, మూడు బు క్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఒక్క సిలిండర్‌ బుక్కింగ్‌కు నె ల రోజుల గడువు విధించారు.

కమర్షియల్‌ సిలిండర్ల నిలిపివేత...

యుద్దం కారణంగా దేశ వ్యాప్తంగా గ్యాస్‌ నిలు వలు తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వా ణిజ్య వ్యాపార సముదాయాలకు ఉపయోగించే కమ ర్శియల్‌ సిలిండర్లపై పలు ఆంక్షలు విధించింది. హో టళ్లు, ఇతర వాణిజ్యసంస్థలకు కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని ఇటీవలే కేంద్రం ఆదేశిం చింది. ఇప్పటికే ఆయా కేంద్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో డీలర్ల వద్ద కమర్షియల్‌ సిలిండర్ల నిల్వ తగ్గి పోయాయి. దీంతో వాణిజ్య సముదాయాలకు సి లిండర్ల కొరత ఎదురవుతుంది.

పౌరసరఫరాల శాఖ కమర్శియల్‌ సిలిండర్లను అ త్యవసరాలకు మాత్రమే ఇవ్వాలంటూ ఏజెన్సీలకు ఆ దేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో ఉన్న సుమారు 500 కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లకు అధికారులు గ్యాస్‌ సరఫరాను నిలిపివేవారు.

ఇంటి దారి పడుతున్న హాస్టల్‌ విద్యార్థులు

గ్యాస్‌ కొరతతో ప్రైవేటు హాస్టళ్లలో చదువుకుంటు న్న విద్యార్థులు ఇంటి దారి పడుతున్నారు. గ్యాస్‌ ఏజె న్సీస్‌ కమర్శియల్‌ సిలిండర్లు ఇవ్వకపోవడంతో వంటకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో గ్యాస్‌ కొరత వల్ల హాస్టళ్లు నడపలేమంటూ మూసివేయడంతో విద్యార్థులు ఇంటిదారి పడుతున్నారు.

నిత్యావసర ధరలకు రెక్కలు..

మందమర్రిటౌన్‌ : పశ్చిమాసియాలో యుద్దంతో నిత్యావసర సరుకుల ధరలు కూడ ఆకాశన్నంట ను న్నాయి. వంట నూనెల నుంచి మొదలు కొని పప్పు దినుసుల ధరలు కూడ విపరీతంగా పెరగనున్నా యి. ఇప్పటికే జిల్లాలో గ్యాస్‌ కొరతతో కమర్శియల్‌ గ్యాస్‌ సరఫరా లేకపోవడంతో హోటల్‌ యాజ మాన్య లు నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చితక ప రిశ్రమలు తాత్కాలికంగా మూతపడే విధంగా ఉన్నా యి. గ్యాస్‌ అధారిత పరిశ్రమలకు పరిస్థితి అగ మ్య గోచరంగా మారింది. ఇతర దేశాల నుంచి దిగు మ తులు లేకుండా ప్రధానంగా వంటనూనె ధర రూ. 170 దాటింది. యుద్దం మరొకొంత కాలం కొనసాగితే పరిస్థితులు తారాస్థాయికి చేరుకునే అవకాశాలు కని పిస్తున్నాయి. మందమర్రి పట్టణంలో కొందరు ఇప్ప టికే కట్టెల పొయ్యిమీద టిఫిన్‌లు చేస్తూ కుటుం బాలను పోషించుకుంటున్నారు.

చిరువ్యాపారులు, హోటళ్లపై ప్రభావం...

హోటల్‌ యజమాని దామోదర్‌...

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాను ప్రభుత్వం నిలిపివే యడంతో చిరువ్యాపారులు, హోటళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా గతంలో ఐదారు కూరలను అందించినప్పటికీ ప్రస్థుత పరిస్థితుల్లో కేవలం రెండు మాత్రమే అందిస్తున్నాం. బయట కట్టెల పొయ్యిద్వారా వంట చేసి హోటల్‌కు తీసుకొస్తున్నాం. కేవలం టిఫి న్స్‌ మాత్రమే గ్యాస్‌ ద్వారా చేస్తున్నాం. యుద్ధం ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కావడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు మరింత ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారులు స్పందించి గ్యాస్‌ అందించాలి.

గ్యాస్‌కొరత లేదు...

ఇండియన్‌ డిస్ర్టిబ్యూటర్‌ రాచకొండ వెంకటేశ్వర్‌రావు...

జిల్లా కేంద్రంలో గ్యాస్‌ కొరత లేదు. గృహ వినియో గదారులకు సరిపడా గ్యాస్‌ నిల్వలు ఉన్నాయి. యు ద్దం కారణం వల్ల కొంత కొరత ఉన్నప్పటికీ వినియో గదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొ రతను నివారించేందుకే వినియోగదారులు గ్యాస్‌ బు కింగ్‌ను నెల గడువు విధించాం. అవసరం లేకున్నా బుక్కింగ్‌ చేసుకుని నిల్వ ఉంచుకుంటున్నారనే సమాచారంతోనే గడువు విధించాము. కమర్షియల్‌ సిలిండ ర్లకు కొరత ఉన్న మాట వ్యాస్తవమే.

Updated Date - Mar 17 , 2026 | 12:13 AM