నీట్ లీకేజీకి బాధ్యత వహించాలి
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:20 PM
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక భాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డి మాండ్ చేశారు.
- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్
నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక భాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డి మాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆ ధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేం ద్రమోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అంబేడ్కర్ చౌరస్తాలో దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విద్యార్థులు, ప్రజ లు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభు త్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చు క్‌ను అర్థరాత్రి అరెస్టు చేసి తగిన వైద్య సదుపా యాలు లేని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించా రు. చలో పార్లమెంటు కా ర్యక్రమాన్ని శాంతియుతం గా నిర్వహిస్తున్న విద్యా ర్థులపై పోలీసులు లాఠీ చార్జి చేయడం, టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, వాటర్ క్యానన్లు ప్రయోగిం చడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రం గా ఖండిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు రామార్జున్, కార్యదర్శి ఎం. తారాసింగ్, ఉపాధ్యక్షులు కార్తీక్, వంశీ, నాయ కులు హేమంత్, భాను, మధు, చింటు, హైమ ద్, రాకేష్, మహేష్, సంజన, శ్రీవాణి, నందిని తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జీ అమానుషం
తెలకపల్లి, (ఆంధ్రజ్యోతి) : నీట్ ప్రశ్నాప త్రం లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహి స్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రాజ్యాంగ రక్షణ దళ్ జిల్లా కమిటీ సభ్యుడు శేఖర్ మాస్టర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై న్యాయం కోరుతూ శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమని ఆయన తీవ్రంగా ఖండించారు.