Share News

kumaram bheem asifabad- దరఖాస్తులకు గడువులోగా సమాధానం అందించాలి

ABN , Publish Date - Oct 23 , 2026 | 10:20 PM

సమాచారహక్కు చట్టం 2005 కింద సమాచారం కోసం వచ్చిన దరఖాస్తులకు నిర్ణీత గడువులోగా సమాధానం అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రజా సమాచార అధికారుల (పీఐఓ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈనెల 28న సమాచారహక్కు కమీషన్‌ సభ్యులు జిల్లాకు రానున్నందున కమీషన్‌కు అప్పీళ్లకు వెళ్లిన దరఖాస్తులకు అవసరమైన సమాచారాన్ని దరఖాస్తు దారులకు అందించి సోమవారంలోగా కలెక్టరేట్‌లో నివేదికలు సమర్పిం చాలని తెలిపారు.

kumaram bheem asifabad- దరఖాస్తులకు గడువులోగా సమాధానం అందించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సమాచారహక్కు చట్టం 2005 కింద సమాచారం కోసం వచ్చిన దరఖాస్తులకు నిర్ణీత గడువులోగా సమాధానం అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రజా సమాచార అధికారుల (పీఐఓ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈనెల 28న సమాచారహక్కు కమీషన్‌ సభ్యులు జిల్లాకు రానున్నందున కమీషన్‌కు అప్పీళ్లకు వెళ్లిన దరఖాస్తులకు అవసరమైన సమాచారాన్ని దరఖాస్తు దారులకు అందించి సోమవారంలోగా కలెక్టరేట్‌లో నివేదికలు సమర్పిం చాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి అవసరమైన సమాచారాన్ని దరఖాస్తు దారులకు అందించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఏఎస్పీ చిత్తరంజన్‌, సబ్‌కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, డీఆర్వో వేణు, ఆర్డీఓ లోకేశ్వర్‌రావులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి

విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని పట్టుదలతో సాదించి కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఐఐటీ కాన్పూర్‌లో విద్యనభ్యసిస్తున్న పెరుగు సాయిరాంకు లాప్‌టాప్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌటాల మండలం బోదన్‌పల్లి గ్రామానికి చెందిన పెరుగు దేవాజీ-కవిత దంపతుల కుమారుడైన సాయిరాం ప్రతిష్ఠాత్మక ఐఐటీ కాన్పూర్‌లో విద్య అభ్యసించడం అభినందనీయమని కొనియాడారు. ఉన్నత విద్యలో ప్రతిభ కనబరుస్తూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని తల్లిదండ్రులకు గ్రామానికి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాదించాలని ఉన్నత విద్యకు ప్రోత్సహకంగా సాయిరాంకు లాప్‌టాప్‌ అందించామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Oct 23 , 2026 | 10:20 PM