Share News

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

ABN , Publish Date - May 18 , 2026 | 11:13 PM

బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై త క్షణమే స్పందించి సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించా లని రామగుండం పోలీస్‌ కమీషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. సోమ వారం బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకున్న సీపీకి పోలీసులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

బెల్లంపల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి) : బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై త క్షణమే స్పందించి సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించా లని రామగుండం పోలీస్‌ కమీషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. సోమ వారం బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకున్న సీపీకి పోలీసులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. సీపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్‌ పరిసరాలను, రిసెప్ష న్‌, సీసీటీఎన్‌ఎస్‌ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బంది పనితీరును అడిగి తె లుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సదంర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌ పరి ధిలో పెట్రోలింగ్‌, వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ విజిబుల్‌ పోలీసింగ్‌ చేపట్టాలన్నారు. ప్రతి కానిస్టేబుల్‌కు కేటాయించిన కాలనీలు, గ్రామాలను సందర్శించి ప్రజలు యువతతో మాట్లాడి శాంతి భద్రతలకు సంబంధిం చి న సమస్యలను తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలను ఏ ర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలపై వాహనదారులకు వివరించాలని సూచించారు. కళాశాలలు, పాఠశాలల ప రిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్య వహరించాలని సూచించారు. ఆయన వెంట డీసీపీ భాస్కర్‌, ఏసీపీ కిరణ్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివఆసరావు తదితరులు ఉన్నారు.

Updated Date - May 18 , 2026 | 11:13 PM