Share News

మహిళలను గౌరవించడం బాధ్యత

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:59 PM

ప్రతీ ఒక్కరూ మహిళలను గౌరవించడం బాధ్యతగా తీసుకోవాలని లక్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌ కాసమల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ల క్షెట్టిపేట న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మహిళలను గౌరవించడం బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి సాయికిరణ్‌

లక్షెట్టిపేట, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరూ మహిళలను గౌరవించడం బాధ్యతగా తీసుకోవాలని లక్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌ కాసమల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ల క్షెట్టిపేట న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన కుటుంబ సభ్యుల్లో ఉన్న ప్రతీ మహిళకు సముచిత స్థానం కల్పించాలని అన్నా రు. పెద్దలు చెప్పిన విధంగా ఇంట గెలిచి సమా జంలో గెలవాలని సూచించారు. ప్రస్తుతం మహి ళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మన న్యాయ స్థానంలో కూడా మహిళా న్యాయవాదుల సంఖ్య ఇంకా పెరగాలని ఆకాంక్షించారు. అనంతరం మ హిళా న్యాయవాదులను అదే విధంగా కోర్టులో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను జడ్జి శాలువాలతో సన్మానించి మహిళా దినోత్సవ శుభా కాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో బార్‌ అసో సియేషన్‌ అధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, ఉ పాధ్యక్షుడు నళినికాంత్‌, ఏజీపీ సంతోష్‌, సీని యర్‌ న్యాయవాదులు రాజేశ్వర్‌రావు, భూంరెడ్డి, అక్కల శ్రీధర్‌, సత్యనారాయణ, సురేందర్‌, ప్రకా శం, సత్యం గౌడ్‌, సత్యం, పద్మతో పాటు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 11:59 PM