రెసోనెన్స్ విద్యార్థుల అద్భుత ప్రతిభ
ABN , Publish Date - May 18 , 2026 | 03:17 AM
రెసోనెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు టీజీ ఎప్‌సెట్-2026లో అద్భుత ఫలితాలు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎం.రుషి రాష్ట్ర మొదటి ర్యాంకు...
హైదరాబాద్ సిటీ, మే 17 (ఆంధ్రజ్యోతి): రెసోనెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు టీజీ ఎప్‌సెట్-2026లో అద్భుత ఫలితాలు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎం.రుషి రాష్ట్ర మొదటి ర్యాంకు, వెటర్నరీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో అటిపాముల భార్గవ రాష్ట్ర 41వ ర్యాంక్ సాధించారు. రాష్ట్రంలోని అగ్రగ్రేణి 10 ఈఏపీసీఈటీ కళాశాలల్లో మెరిట్ సీట్లకు 1250 పైగా విద్యార్థులు అర్హత సాధించారు. మాదాపూర్ సిద్ధివినాయకనగర్‌లోని ఓ కన్వెన్షన్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆదివారం సాయంత్రం సత్కరించారు. ఈ సందర్భంగా రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమకు నిదర్శనమన్నారు.